St. Louis: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) తాజాగా మిస్సోరీ (Missouri) లోని సెయింట్ లూయిస్ మహాత్మ గాంధీ సెంటర్ (Mahatma Gandhi Center) లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
North America Telugu Society – NATS సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి (Dr. Sudheer Atluri) ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. స్థానికంగా ఉండే తెలుగు వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందారు. డాక్టర్లను అడిగి తమ అనారోగ్యాలకు గల కారణాలను, నివారణ మార్గాలను తెలుసుకున్నారు.
North America Telugu Society – NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి (Srinivas Manchikalapudi), నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ నాయకులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల మధుసూదన్ దడ్డ లతోపాటు పలువురు NATS వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం దిగ్విజయం చేయడంలో కృషి చేశారు.
సెయింట్ లూయిస్‌లో తెలుగువారి కోసం వైద్య శిబిరాన్ని (Health Camp) నిర్వహించిన మిస్సోరీ చాప్టర్ (NATS Missouri Chapter) నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు.