St. Louis, Missouri, July 23: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని (Health Camp) నిర్వహించింది.
నాట్స్ మిస్సోరీ విభాగం (NATS Missouri Chapter) ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లోని మహాత్మగాంధీ సెంటర్‌లో నాట్స్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక తెలుగు వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.
నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి (Srinivas Manchikalapudi), రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల (Sandeep Kollipara), నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, మిస్సోరీ నాట్స్ టీం సభ్యులు మధుసూదన్ దద్దల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు తమవంతు సహకారం అందించారు.
నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి (Dr. Sudheer Atluri) ఈ శిబిరంలో తెలుగు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.