Connect with us

Food Drive

North Texas Food Bank: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కు మంచి స్పందన

Published

on

డల్లాస్, అక్టోబర్ 12: భాషే రమ్యం సేవే గమ్యం అనే తన నినాదానికి అనుగుణంగా నాట్స్ అనేక సేవ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం గత 13 సంవత్సరాలనుండి ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

ఈ ఫుడ్ డ్రైవ్ కి మంచి స్పందన లభించింది. తాజాగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ ద్వారా 360 పౌoడ్లకు పైగా వచ్చిన ఫుడ్ కాన్స్ ను స్థానిక నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌ (North Texas Food Bank) కు అందించింది. పోషకాహార లోపంతో బాధ పడుతున్న చిన్నారులు, ఒక్క పూట కూడా భోజనం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు, వసతిలేని వారు, అనాధ ఆశ్రమాలకు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ నాట్స్ ఇచ్చిన ఫుడ్‌ని అందించనుంది.

పేదరికం కారణంగా ఎవరూ ఆకలితో అలమటించకూడదనే సేవా భావంతో నాట్స్ (NATS) ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామనేని, ఇతర కార్యవర్గ సభ్యులు కీలక పాత్ర పోషించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫుడ్ డ్రైవ్ ను నిర్వహిస్తూ పేదలకు ఆహారాన్ని అందిస్తున్నందుకు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు నాట్స్ డల్లాస్ విభాగం నాయకులను ప్రశంసించారు.

ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేసిన డల్లాస్ (Dallas) చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామనేని, కార్యవర్గసభ్యులు రవీంద్ర చుండూరు, శివ నాగిరెడ్డి, వెంకట్, ఇతర సభ్యులకు నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు), బోర్డు ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, నేషనల్ కోఆర్డినేటర్ కవిత దొడ్డ, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్‌లు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

డల్లాస్ విభాగం ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ (North America Telugu Society) డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్ మరియు ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి నాట్స్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected