Connect with us

News

మదన్ పాములపాటి అధ్యక్షునిగా NATS నూతన కార్యవర్గం ఏర్పాటు

Published

on

జూన్ 1, 2024: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS 2024-26 కాలానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. చికాగో విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మదన్ పాములపాటి (Madan Pamulapati) కి నాట్స్ బోర్డు (NATS Board) నాట్స్ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. గతంలో చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) లో జరిగిన ఎన్నో సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు.

రెండుసార్లు నాట్స్ (NATS) కోశాధికారి, సంబరాల కమిటీ సెక్రటరీ, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్) ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో నాట్స్ అధ్యక్ష పదవికి మదన్ పాములపాటి వైపే నాట్స్ బోర్డ్ (NATS Board of Directors) మొగ్గు చూపింది. నాట్స్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఒకరికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్త గా ప్రవేశపెట్టింది. నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది.

వారిలో శ్రీహరి మందాడి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), శ్రీనివాసరావు భీమినేని (వైస్ ప్రెసిడెంట్ – ఆపరేషన్స్), హేమంత్ కొల్ల (వైస్ ప్రెసిడెంట్ -ఫైనాన్స్), భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (వైస్ ప్రెసిడెంట్ -మార్కెటింగ్), శ్రీనివాస్ చిలుకూరి (వైస్ ప్రెసిడెంట్ – ప్రోగ్రామ్స్), నాట్స్ కార్యదర్శి గా రాజేష్ కాండ్రు, కార్యనిర్వహక కార్యదర్శి (మీడియా) గా మురళీ కృష్ణ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్) గా రవి తుమ్మల, కార్యనిర్వాహక సహ కార్యదర్శి (వెబ్) గా ఫాలాక్ష్ అవస్థి, కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని, సంయుక్త కోశాధికారిగా రవి తాండ్ర లకు నాట్స్ బోర్డు (NATS Board) బాధ్యతలు అప్పగించింది.

నాట్స్ కార్యవర్గ జాబితా మిగతా వివరాలు

కిషోర్ గరికపాటి: నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్)
రామకృష్ణ బల్లినేని: నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్షిప్)
సంకీర్త్ కటకం: నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా)
రాజలక్ష్మి చిలుకూరి: నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్మెంట్)
భాను లంక: నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్లైన్)
యమ్మానుయేల్ నీల: నేషనల్ కోఆర్డినేటర్ (ఫండ్ రైసింగ్)
కిరణ్ మందాడి: నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్)
వెంకట్ మంత్రి: నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్)
కిశోరె నారె: నేషనల్ కోఆర్డినేటర్ (మీడియా)
శ్రీనివాస్ మెంట: జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్ జోన్)
మనోహర రావు మద్దినేని: జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ వెస్ట్ జోన్)
వెంకటరావు దగ్గుపాటి: జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ ఈస్ట్ జోన్)
శ్రీ హరీష్ జమ్ముల: జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ సెంట్రల్ జోన్)
సత్య శ్రీరామినేని: జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ సెంట్రల్ జోన్)
సుమంత్ రామినేని: జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ ఈస్ట్రన్ జోన్)

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected