అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేస్తూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా చికాగోలో దీపావళి వేడుకలు నిర్వహించింది. దాదాపు 300 మందికిపైగా తెలుగువారు నవంబర్ 7న చికాగోలోని నేపెర్విల్లే లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆట, పాట కార్యక్రమాలతో పాటు దీపావళి పటాసులు కాల్చి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. తర్వాత చక్కటి విందు కూడా నాట్స్ ఏర్పాటు చేసింది.
చికాగోలో తెలుగువారందరిని ఒక్కటి చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంపై నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని చికాగో నాట్స్ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ సేవా కార్యక్రమాలతో పాటు అమెరికాలో తెలుగు వారందరిని ఓ కుటుంబంలా కలిపి ఉంచేందుకు చేస్తున్న కృషి గురించి వివరించారు.
అమెరికాలో తెలుగుజాతి కోసం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, నిస్వార్థంతో, సేవాభావంతో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలకు మంచి మద్దతు లభిస్తుందని నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే అన్నారు.
చికాగో నుంచి నాట్స్ బోర్డ్, ఈసీ సభ్యులు మూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, విజయ్ వెనిగళ్ల, మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బొజ్జ తదితరులు సహకారంతో నాట్స్ చికాగో నాయకులు డా. వేణు కృష్ణార్ధుల, డాక్టర్ ప్రసుధ నున్న, బిందు వీధులమూడి, శ్రీహరీశ్ జమ్మల, కార్తీక్ మోదుకూరిలు దీపావళి వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు.
బిందు బాలినేని, రోజా శీలంశెట్టి, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ బొప్పన్న, కృష్ణ నున్న, ఆర్.కె. బాలినేని, పండు చెంగలశెట్టి, వంశీ మన్నే, మురళి కలగర, అరవింద్ కోగంటి, రవి బాలినేని, మనోహర్ పాములపాటి, అరుల్ బాబు,యజ్నేష్, వినోద్ బాలగురు, అజయ్, శేఖర్ మిడతన, నవీన్ జరుగుల, రామ్ తూనుగుంట్ల, శ్రీనివాస్ పిల్ల, రాజేశ్ వీధులమూడి, శ్రీకాంత్ బొజ్జ, కిరణ్ అంబటి, శ్రీనివాస్ పిల్ల, వెంకట్ తోట తదితర నాట్స్ వాలంటీర్లు దీపావళి వేడుకల్లో తమ అమూల్యమైన సేవలు అందించినందుకు నాట్స్ జాతీయ నాయకత్వం వారిని ప్రత్యేకంగా అభినందించింది.