Connect with us

Food Drive

పిల్లల్లో సేవాభావాన్ని పెంచేలా, పేదల ఆకలి తీర్చేలా NATS & Feed My Starving Children ఫుడ్ డోనేషన్ @ Dallas, Texas

Published

on

Dallas, Texas: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్‌సన్ (Richardson) నగరంలో నాట్స్ డల్లాస్ (NATS – Dallas) విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ (Feed My Starving Children) సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ (Food Donation) కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది.

ఈ కార్యక్రమానికి నాట్స్ (NATS) పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి (Bapu Nuthi), నాట్స్ డల్లాస్ చాప్టర్ (Dallas Chapter) జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ (Swapna Katragadda), శ్రావణ్ నిడిగంటిలు (Shravan Nidigantilu) నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు.

నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల (Surendra Dhulipalla) ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society – NATS) జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల (Rajendra Madala), రవి తాండ్ర (Ravi Tandra), కిషోర్ నారె (Kishore Nare), సత్య శ్రీరామనేని (Satya Sriramaneni) మరియు డల్లాస్ చాప్టర్ (Dallas Chapter) జట్టు నుండి సుమతి మాదాల (Sumathi Madala), శివ మాధవ్ (Shiva Madhav), బద్రి బియ్యపు, కిరణ్ నారె (Kiran Nare) తదితరులు పాల్గొన్నారు.

“ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది” అనే నినాదంతో నాట్స్ (NATS) సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi) అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ (Swapna Katragadda) మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . డాలస్ చాప్టర్ టీం (Dallas Chapter Team), సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) హర్షం వ్యక్తం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected