Connect with us

Sports

చికాగోలో వెల్లివిరిసిన క్రీడా ప్రతిభ @ NATS Cricket Tournament

Published

on

Chicago, Illinois: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఎస్.ఆర్.కె టీం ఈ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.

ఇందులో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు. నాట్స్ చికాగో విభాగం క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

నాట్స్ (North America Telugu Society) కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి లు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి మంచి ప్రశంసలు లభించాయి.

ఈ టోర్నమెంట్ నిర్వహణలో చికాగో చాప్టర్ టీమ్ (NATS Chicago Chapter) నుంచి నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు తదితరులు కీలక పాత్ర పోషించినందుకు వారికి నాట్స్ (NATS) నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ (NATS) మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన లు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.

సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితర వాలంటీర్లు ఈ టోర్నమెంట్ (Cricket Tournament) విజయానికి కృషి చేసినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది.

నాట్స్ (North America Telugu Society) అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ (Srinivas Arasada) ఈ టోర్నమెంట్‌ (Cricket Tournament) లో విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలను (Trophies) అందజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected