నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్ డల్లాస్ నాట్స్ చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. తెలుగు ఆట పాటలతో కిక్ ఆఫ్ ఈవెంట్‌లో పాల్గొన్న వారికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్‌లోనే నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతిని నాట్స్ నాయకులు సన్మానించారు.
నాట్స్ ప్రెసిడెంట్‌గా బాపు నూతి చేస్తున్న సేవలను కొనియాడారు. డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామేనని, రవి తాండ్ర, డల్లాస్ చాప్టర్ టీం సేవలను నాట్స్ జాతీయ నాయకులు ప్రశంసించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల (Rajendra Madala) కొత్తగా ఎన్నుకోబడిన జాతీయ కార్య నిర్వాహక కమిటీ సభ్యులని వేదిక మీదకి ఆహ్వానించి అందరికి పరిచయం చేశారు.
ఏడు నెలల క్రితం తను నాట్స్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నుంచి అటు భారతదేశం (India) ఇటు అమెరికా (USA) లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మొదలు పెట్టి వాటిని కొనసాగిస్తున్నామని నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి తెలిపారు. ముఖ్యంగా ఇండియా లో పేద విద్యార్థులుకు స్కాలర్‌షిప్‌లు, వైద్య మరియు కంటి శిబిరాలు, చెరువుల తవ్వకాలు, గ్రామాభివృద్ధి పనులు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి వాటిని కొనసాగిస్తుమన్నారు.
అమెరికాలో ఇప్పటికే నాట్స్ చేస్తున్న సేవలను కొనసాగిస్తూనే నాట్స్ కొత్తగా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యతనిస్తూ నాట్స్ ఉచిత యోగా శిక్షణ శిబిరాలు, విద్యార్థులకు సాఫ్ట్ వేర్ శిక్షణ తరగతులు, సినిమా స్క్రిప్ట్ రైటింగ్ వర్క్‌షాప్, తెలుగు పద్య రచన, సాహిత్య సదస్సులు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇంకా నాట్స్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నామని బాపు నూతి తెలిపారు.
ఇదే స్పూర్తితో రానున్న రోజుల్లో అందరి సహకారంతో నాట్స్ ను మరింత బలోపితం చేస్తామని చెప్పారు. చివరిగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన డల్లాస్ నాట్స్ టీమ్ ని, ఇలాంటి సేవలకు, కార్యక్రమాలకు సహాయ, సహకారాలను అందిస్తున్న దాతలందరిని, మీడియా పార్టనర్స్ ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యంగా నాట్స్ (North America Telugu Society) అమెరికా తెలుగు సంబరాలకు జరుగుతున్న ఏర్పాట్లను బాపు నూతి వివరించారు. మే 26-28 వ తేదీలలో న్యూ జెర్సీ కన్వెన్షన్ & ఎక్స్ పొజిషన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరపనున్న మన తెలుగు పండగలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని కోరారు.
తెలుగు నేల నుంచి అతిరథ మహారథులు, సినీ ప్రముఖుల ఈ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) సంబరాలకు వస్తున్నారని బాపు నూతి (Bapu Nuthi) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారందరిని ఈ సంబరాలకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తానా, ఆటా, నాటా, టాటా, ఏటీఎస్ ఐఎఎన్‌టీ, టాంటెక్స్, టీడీఎఫ్, టీప్యాడ్, ఐటీ సర్వ్, డేటా, సిలికానాంధ్ర మనబడి, కళావాహిని సంస్థల ప్రతినిథులు నాట్స్ ప్రెసిడెంట్‌గా బాపు నూతి చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలను తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.