అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఈ సారి చాలా ప్రత్యేకంగా జరగనున్నాయని సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీథర్ అప్పసాని న్యూ జెర్సీ, ఎడిసన్ లోని మొఘుల్ బాల్రూమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు.
ఈసారి స్థానిక కళాకారుల ప్రదర్శనకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. అలాగే ఈసారి ఇంతవరకు అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో ఎవరూ చేయని పేరెంట్స్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని చేస్తున్నామని, ఈ కార్యక్రమం మన తల్లిదండ్రులను మనం గౌరవించుకునేందుకు చేపట్టిందని శ్రీథర్ అప్పసాని వివరించారు.
నాట్స్‌కు విరాళమివ్వడం అంటే కేవలం సంబరాల కోసమే కాదని, ఓ సమున్నత ఆశయం కోసం, ఆపదలో ఉన్న సాటి మనిషికి చేయూత అందించడం కోసం అనేది మరిచిపోవద్దని శ్రీధర్ అప్పసాని అన్నారు. సంబరాల కమిటీలో ఫండ్ రైజింగ్ కోసం కృషి చేస్తున్న రాజ్ అల్లాడ, కళ్యాణ్ లక్కింశెట్టి, వంశీ కొప్పురావూరిని శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు.
నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటివరకు నాట్స్ ఎంతో మందికి సాయం చేసిందని నాట్స్ మాజీ ఛైర్మన్ శామ్ మద్దాళి తెలిపారు. ముఖ్యంగా కరోనా విజృంభించిన గత రెండేళ్లలో బాధితులను ఆదుకునేందుకు చేసిన కార్యక్రమాలు ఎప్పటికి మరిచిపోలేనివని అన్నారు.
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా నిలబడింది అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయనినాట్స్ మాజీ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు అన్నారు. అభినయ్ కుటుంబానికి ఎలా అండగా నిలిచింది ఆయన వివరించారు. సంబరాల్లో ఈ సారి స్థానిక కళాకారులను ప్రోత్సాహించే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు.
అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉన్నాయని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగమ్మాయి కార్యక్రమం మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్ధంపట్టనుందని ఆమె తెలిపారు.
సంబరాల కో-కన్వీనర్ రాజ్ అప్పలనేని 2009 నుండీ నాట్స్ కు తనవంతు సహాయం అందిస్తున్నానని, మున్ముందు కూడా తన సహకారం ఉంటుందని తెలియచేశారు. జిలినియల్ అనే పేరుతో యువత కు పెద్ద పీట వేస్తూ, మరో కో కన్వీనర్ వసుంధర దేసు తన టీంతో వచ్చి ప్రత్యేకంగా ఆ కార్యక్రమ వివరాలు ప్రకటించారు. నార్త్ ఈస్ట్ జోన్ లోని కాలేజీ యువతతో ప్రత్యేక కార్యక్రమాలు రూపుదిద్దుకోనున్నట్లు తెలియచేశారు.
ఐటీ సర్వ్ సంస్థ అధ్యక్షుడు వినయ్ మహాజన్ మరియు సంస్థ ప్రతినిధులు హాజరై నాట్స్తో చేయి చేయి కలిపి రానున్న సంబరాలకు తమవంతు సహాయం అందిస్తామన్నారు. స్థానిక టి.ఎఫ్.ఎ.ఎస్, టి.ఎ.జి.డి.వి, ఏఏఏ, తదితర సంస్థ ప్రతినిధులు విచ్చేసి తమ మద్దతు ప్రకటించారు.
సంస్థలన్నీ కలిసి ముందుకు వెళ్తే మరింత మందికి సేవ చేయగలుగుతామనే సంబరాల కన్వీనర్ శ్రీధర్అప్పసాని మాటలతో ఏకీభవిస్తూ తమ వంతు విరాళాలు ప్రకటించారు. చివరిగా శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ సంబరాలకు తమవంతు డొనేషన్ ఈ రాత్రి మొత్తంగా 1.6 మిలియన్ డాలర్లవిరాళాలు ప్రకటించిన దాతలందరినీ మనస్పూర్తిగా అభినందించారు.
నాట్స్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు తానా తన మద్దతు ప్రకటించింది. తానా నాయకులు రవి పొట్లూరి, విద్య గారపాటి ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు విచ్చేశారు. నాట్స్ సంబరాల కోసం తానా 20 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. సంబరాల ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవంతానికి సంబరాల కమిటీ నాయకులు, నాట్స్ నాయకులు కృషి చేశారు. నాట్స్ అమెరికాతెలుగు సంబరాల ఫండ్ రైజింగ్‌కు పిలుపుకు స్పందించిన వారందరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.