Sattenapalli, Palnadu: పేదలకు, పేద విద్యార్ధులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాట్స్ (North America Telugu Society – NATS) తాజాగా ఉమ్మడి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పరివర్తన ఆశ్రమ పాఠశాలకు తన వంతు చేయూత అందించింది.
ఈ పాఠశాలలో చదువుకునే దివ్యాంగ విద్యార్ధులకు నాట్స్ (NATS) అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) నూతన వస్త్రాలు అందించారు. అంతే కాకుండా ఈ పాఠశాలలో విద్యార్ధుల ఆహారానికి కావాల్సిన బియ్యం, కందిపప్పు లాంటి నిత్యావసర సరుకులను కూడా ఈ పాఠశాలకు అందించారు.
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో నాట్స్ (North America Telugu Society – NATS) ముందుకు సాగుతుందని దివ్యాంగులకు, పేద విద్యార్ధులకు నాట్స్ తన వంతు సాయం చేస్తుందని నాట్స్ (NATS) అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు.