Connect with us

Movies

ప్రముఖ నటులు చలపతిరావు మృతి పట్ల నాట్స్ సంతాపం

Published

on

టాలీవుడ్ ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే మరో సీనియర్‌ నటులు చలపతిరావు మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఓ ప్రకటనలో తెలిపింది. 1200 కి పైగా తెలుగు చిత్రాల్లో నటించి ఏ పాత్ర వేసినా అందరి చేత శభాష్ అనిపించుకున్న చలపతిరావు మరణం తమను కలిచివేసిందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.

తెలుగు సినిమాల్లో విలనిజంతో పాటు కామెడీ పండించడంలో కూడా చలపతిరావుది విలక్షణమైన శైలి అని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. చలపతిరావు కుటుంబానికి నాట్స్ నాయకులు, సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected