Connect with us

News

నాట్స్ సేవలు, కన్వెన్షన్ వివరాలను WFLA TV Channel 8 తో పంచుకున్న ప్రశాంత్ పిన్నమనేని, NATS Chairman

Published

on

Tampa Bay, Florida: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలు కన్వీనర్ & నాట్స్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) మరియు నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) సారధ్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని స్థానిక WFLA-TV (Channel 8) డే టైం షో లో గెస్ట్ గా పాల్గొన్నారు. 1955 లో టాంపా నగరంలో స్థాపించిన WFLA-TV, డే టైం షో (Daytime Show) హోస్ట్ మాగీ రొడ్రీగ్ (Maggie Rodriguez) తో మాట్లాడుతూ నాట్స్ సంస్థ సేవలు, ఆశయాలు పంచుకున్నారు.

తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, బాషా పరిరక్షణ, భారతదేశం (India) లో చేసే సేవాకార్యక్రమాల వివరాలు ప్రస్తావించారు. వీటితోపాటు అమెరికా (USA) లో ప్రతి సంవత్సరం థాంక్స్ గివింగ్, క్రిస్మస్ సమయాలలో స్థానికంగా అన్ని నగరాలలో చేస్తున్న కంట్రిబ్యూషన్స్ ని ప్రశాంత్ (Prasanth Pinnamaneni) వివరించారు.

అలాగే జులై 4,5,6 తేదీలలో టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా నిర్వహించనున్న 8వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించిన పలు విషయాలు తెలియజేశారు. VISITTAMPABAY.COM, స్థానిక మేయర్, షెరీఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ తదితర విభాగాలు చేస్తున్న సమన్వయం, సహాయాన్ని అభినందించారు.

ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మాటల్లో మరిన్ని వివరాలకోసం క్రింది లింక్ ని సందర్శించండి. https://www.wfla.com/video/exploring-tampa-bays-tapestry-celebrating-telugu-culture-heritage-and-community-daytime/10830926.

నాట్స్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నాట్స్ (North America Telugu Society) 8వ అమెరికా తెలుగు సంబరాలకు (NATS Convention) ఆలస్యం చేయకుండా త్వరగా https://sambaralu.org/buynow ని సందర్శించి ఆన్లైన్ లో టికెట్స్ కొనుక్కోవచ్చు.

error: NRI2NRI.COM copyright content is protected