Robbinsville, New Jersey: అమెరికా లో తెలుగు వారిలో క్రీడా స్ఫూర్తిని నింపేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) అనేక క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజా గా న్యూజెర్సీలో గత ఆదివారం నాడు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. రాబిన్స్‌విల్లే ఔట్‌డోర్ శాండ్ వాలీబాల్ కోర్టులలో ఈ టోర్నమెంట్‌ని నాట్స్ న్యూజెర్సీ విభాగం ఘనంగా నిర్వహించింది.
న్యూజెర్సీ నలుమూలల (సౌత్ జెర్సీ, నార్త్ జెర్సీ, సెంట్రల్ జెర్సీ) నుంచి మొత్తం 14 వాలీబాల్ (Volleyball) జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీ పడ్డాయి. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జట్ల స్థాయిని బట్టి పోటీలను అడ్వాన్స్‌డ్ లీగ్ ,మేజర్ లీగ్ అని రెండు ప్రధాన లీగ్‌లుగా విభజించి పోటీలు జరిపారు..
అడ్వాన్స్‌డ్ లీగ్‌లో పిందాల్లే జట్టు విజేతగా ట్రోఫీ ని గెలుచుకుంది… రెబెల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇక మేజర్ లీగ్‌లో అప్‌సెట్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. రైకర్స్ జట్టు రన్నరప్ గా నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు ట్రోఫీలను నాట్స్ నాయకులు అందజేశారు. ఈ టోర్నమెంట్‌ను నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) పర్యవేక్షించారు.
తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా నాట్స్ ముందుంటుందని శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేనితో (Srinivas Bheemineni) పాటు ఆయన నేతృత్వంలో రాబిన్స్ విల్లే టీం సభ్యులు రంగరాజు, సుకేష్ సబ్బాని, నీలం శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు ఈ టోర్నమెంట్ విజయానికి ఎంతో కృషి చేశారు.
అలాగే నాట్స్ నాయకులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీ రావు, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి (Kiran Mandadi), నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్ల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెల్లూరి, సురేంద్ర పోలేపల్లి, కృష్ణ సాగర్ రాపర్ల, మౌర్య యలమంచిలి, కృష్ణ గోపాల్ నెక్కంటి
మరియు బ్రహ్మానందం పుసులూరి, శ్రీనాథ్, జతిన్ కొల్లా, చైతన్య మాదాల, ధర్మా, బినీత్ తదితరులు ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashant Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.