Connect with us

Health

NATS @ New Jersey, Edison: మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సు

Published

on

Edison, New Jersey: అక్టోబర్ 29: తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) అవగాహన సదస్సు నిర్వహించింది.

బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా నాట్స్ మహిళల కోసం ఒక ప్రత్యేక అవగాహన సదస్సు (Awareness Session) ను నిర్వహించింది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చికిత్సపై ఉన్న అపోహలను తొలగించి, సరైన సమాచారాన్ని అందించేలా ఈ అవగాహన సదస్సు జరిగింది.

నాట్స్ మహిళా నాయకులు (NATS Women Leaders) ఈ సదస్సులో పాల్గొని బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఉన్న మహిళలకు అవగాహన కల్పించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన అనేది కేవలం సమాచారం మాత్రమే కాదని ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధనమని నాట్స్ మహిళా నాయకులు వివరించారు.

సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. అందుకే, ప్రతి మహిళా తన ఆరోగ్యాన్ని, జీవితాన్ని అత్యంత విలువైనదిగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ NATS అవగాహన సదస్సులో సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) తో పాటు, బోర్డు నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు యలమంచిలి (Bindu Yalamanchili) క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్ నిర్వహించటం లో కీలక పాత్ర పోషించారు.

నాట్స్ న్యూజెర్సీ సభ్యులు (NATS New Jersey Chapter) సురేంద్ర పోలేపల్లి, సాయి లీలా మాగులూరి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందడి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, పాస్ట్ చైర్ ఉమన్ అరుణ గంటి (Aruna Ganti), గంగాధర్ దేసు, శ్రీదేవి జాగర్లమూడి, గాయత్రి చిట్టేటి, స్వర్ణ గడియారం, స్మిత, సాగర్ రాపర్ల, మౌర్య యలమంచిలి, రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల తదితరులు పాల్గొన్నారు.