Connect with us

Competitions

ఔరా అనేలా 250+ తెలుగు చిన్నారుల ప్రతిభ @ Philadelphia నాట్స్ బాలల సంబరాలు

Published

on

Philadelphia , December 16, 2024: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఫిలడెల్ఫియా (Philadelphia) లో బాలల సంబరాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియా లోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి.

ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాఠవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు.. అలాంటి పౌరులను ఉత్తమ పౌరులుగా, మంచి నాయకులుగా తీర్చిదిద్దేందుకు నాట్స్ బాలల సంబరాలు దోహద పడతాయని నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) అన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తెలుగు విద్యార్ధుల బంగారు భవితకు తోడ్పడే ఎన్నో కార్యక్రమాలు నాట్స్ (NATS) చేపడుతుందని శ్రీధర్ అప్పసాని తెలిపారు.

పోటీలకు అద్భుత స్పందన

బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం అంశాల్లో నాట్స్ (NATS) పోటీలు నిర్వహించింది. ఎనిమిది ఏళ్ళలోపు, పన్నెండు ఏళ్ళలోపు, పన్నెండు ఏళ్ల పైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. అనేక మంది పిల్లలు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.

నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల (Harinath Bungatavula), నేషనల్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్స్ రమణ రాకోతు, బోర్డు అఫ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, చాఫ్టర్ కోఆర్డినేటర్ సరోజ సాగరం, సంయుక్త కార్యదర్శి రామ్ నరేష్ కొమ్మనబోయిన, బాబు మేడి, విశ్వనాథ్ కోగంటి, నిరంజన్ యనమండ్ర, అప్పారావు మల్లిపూడి, రాజశ్రీ జమ్మలమడక, శ్రీనివాస్ సాగరం, సురేంద్ర కొరటాల, పార్ధ మాదాల, రవి ఇంద్రకంటి, సాయి సుదర్శన్ లింగుట్ల, శ్రీనివాస్ ప్రభ, రామక్రిష్ణ గొర్రెపాటి, మధు కొల్లి, రామ్ రేవల్లి, నాగార్జున కొత్తగోర్ల, రాఘవన్ నాగరాజన్, వేణు కొడుపాక, చైతన్య & లహరి, కృష్ణ నన్నపనేని, కిషోర్ నర్రా ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

నాట్స్ (NATS) జాతీయ కార్యవర్గ సభ్యులు రాజేష్ కాండ్రు, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిఏజిడివి (Telugu Association of Greater Delaware Valley – TAGDV) అధ్యక్షులు రామ్మోహన్ తాళ్లూరి, కార్యదర్శి సురేష్ బొందుగుల, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, సంయుక్త కోశాధికారి శివ అనంతుని, లవకుమార్ ఐనంపూడి, పూర్వ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని, తదితరులు పాల్గొని వారికి తోడ్పాటుని అందించారు.

బాలల సంబరాల కోసం యూత్ మెంబర్స్ అమ్రిత శాకమూరి, స్తుతి రాకోతు, యుక్త బుంగటావుల, నిత్య నర్ర, ప్రణతి జమమ్మలమడక, అభినవ్ మేడి, నిహారిక ఐనంపూడి, హవిషా పోలంరెడ్డి, అక్షయ పుల్యపూడి, సుమేధ గవరవరపు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం నిర్వహించిన బాలల సంబరాల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, వల్లి పిల్లుట్ల, శ్రీలక్ష్మి జంధ్యాల, సౌమ్య గండ్రకోట, మైత్రేయి కిదాంబి, భారతి అశోక్, ప్రత్యూష నాయర్, సవిత వారియర్, శ్రీ హరిత, మధుమిత, ప్రసన్న గన్నవరపు, శ్రీదేవి ముంగర, రఘు షాపుష్కర్, నాగేశ్వరి అడవెల్లి, పద్మ శాస్త్రి, కల్యాణ రామారావు గన్నవరపు, విమల మొగుళ్లపల్లి, రూప మంగం, ఈ NATS సంబరాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

సాకేత్ ప్రభ గణేశ ప్రార్ధనతో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా సాగింది. రెండు వందల యాబై పైగా చిన్నారులు ఈ సంబరాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్వేత కొమ్మోజి (Swetha Kommoji) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తెలుగు సినీగీతాల గానం, నృత్యంతో చిన్నారులు అద్వైత్ బొందుగుల, ధృతి కామరాసు, క్రిశిత నందమూరి, అనిషా చెరువుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. బాలల సంబరాలకు రుచికరమైన విందు అందించినందుకు మహాక్ష ఇండియన్ ఫ్లేవర్ రెస్టారెంట్‌ను నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల అభినందించారు.

తెలుగు చిన్నారుల ప్రతిభకు వేదికైన ఫిలడెల్ఫియా నాట్స్ (North America Telugu Society – NATS) బాలల సంబరాలకు స్పాన్సర్స్‌గా డివైన్ ఐటీ సర్వీసెస్, వెంకట్, సుజనా శాకమూరి, రిటైర్ వైజ్లీ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సంపూర్ణ సాయం అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected