Los Angeles, California, December 17, 2024: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ… భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నాట్స్ లాస్ ఏంజిల్స్ బాలల సంబరాలు అత్యంత వైభవంగా అందరిని ఆకట్టుకునేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హాస్య నాటికలు, ఫాన్సీ డ్రెస్ ప్రదర్శన, ఫ్యాషన్ షో, మాథమాటిక్స్ & చెస్ పోటీలు ఘనంగా జరిగాయి.
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా లాస్ ఏంజిల్స్ (Los Angeles, California) లో నిర్వహించిన ఈ సంబరాలలో దాదాప 900 మందికిపైగా తెలుగు వారు (Telugu People) ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ బాలల సంబరాల్లో 300 మందికి పైగా చిన్నారులు సంప్రదాయ, జానపద, చలనచిత్ర నృత్యాల ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసారు.
ఆద్యంతం ఆహ్లదభరితంగా సాగిన ఈ ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలల సంబరాల్లో ఫ్యాషన్ షో (Fashion Show) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల దుస్తులు ధరించిన పిల్లలతో సాగిన ప్రదర్శన కన్నులపండుగగా ఆద్యంతం సాగింది. అదేవిధంగా ఫాన్సీ డ్రెస్ షో కూడా వివిధ ప్రముఖ పాత్రలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నాట్స్ బాలల సంబరాలకు రాజ్యలక్ష్మి చిలుకూరి (Rajalaxmi Chilukuri) వ్యాఖ్యాతగా వ్యవహరించి ఈ సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బాలల సంబరాల్లో భాగంగా ఫ్యాషన్‌తో, విద్య, సాంస్కృతిక అంశాల్లో వివిధ పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చదరంగం, గణిత పోటీలు విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికి తీసి వారిని ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ బాలల సంబరాల్లో భాగంగా గురు కృష్ణ కొంకా & రావిలిశెట్టి వెంకట నరసింహారావు లకు వారి సామాజిక , నాట్స్ (NATS) సేవలను గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ తో పాటు సన్మాన పత్రాలు నాట్స్ బోర్డ్ గౌరవ సభ్యులు రవి ఆలపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మధు బోడపాటి, నాట్స్ కార్యక్రమాల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చిలుకూరి (Srinivas Chilukuri) తో వారికి సన్మానం చేశారు.
లాస్ ఏంజిల్స్ లో బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్స్ కిషోర్ గరికపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్, మెంటర్స్ హరి కొంక, వెంకట్ ఆలపాటి తదితరుల సహకారంతో ఈ బాలల సంబరాలు విజయవంతంగా జరిగాయి.
బాలల సంబరాల నిర్వహణలో విశేష కృషి చేసిన లాస్ ఏంజిల్స్ చాప్టర్ (NATS Los Angeles Chapter) కోఆర్డినేటర్ మురళి ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, నాట్స్ టీం సభ్యులు గురు కొంక, శ్రీనివాస్ మునగాల, సిద్ధార్థ కోలా, అరుణ బోయినేని, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, చంద్ర మోహన్ కుంటుమళ్ల, ముకుంద్ పరుచూరి, సరోజ అల్లూరి, పద్మ గుడ్ల, రేఖ బండారి, లత మునగాల, నరసింహారావు రవిలిశెట్టి, సుధీర్ కోట, శ్యామల చెరువు, మాలతి, నాగ జ్యోతి ముద్దన, హారిక కొల్లా, అనూష సిల్లా, హర్షవర్ధన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ ఆలపాటి, చంద్రర్క్ ముద్దనతో పాటు ఇతర వాలంటీర్లను నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది.
నాట్స్ లాస్ ఏంజిల్స్ చాప్టర్ (NATS Los Angeles Chapter) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బాలల సంబరాలకు రుచికరమైన ఆహారాన్ని విష్ణు క్యాటరింగ్ గ్రూపుకు చెందిన రామ్ కడియాలను నాట్స్ అభినందించింది. సంబరాల ముగింపులో సాంస్కృతిక మహోత్సవం అందరికి సంతోషాలను, మధురానుభూతులను పంచింది.