Connect with us

Kids

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించిన NATS బాలల సంబరాలు @ Tampa Bay, Florida

Published

on

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా టాంపా బే ఫ్లోరిడా (Tampa Bay) లో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది. ప్లోరిడా (Florida) లోని హిందు దేవాలయంలో జరిగిన ఈ నాట్స్ (NATS) సంబరాలలో 400 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు.

దాదాపు 200 మంది విద్యార్ధులు ప్రతిభా పోటీల్లో (Competitions) పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. చెస్, మ్యాథ్‌బౌల్, ఆర్ట్, రుబిక్ క్యూబ్ పోటీలతో పాటు వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల అనంతరం నృత్య ప్రదర్శనలు, మ్యూజిక్ షో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు బాలల సంబరాల సంతోషాన్ని అంబరాన్ని అంటేలా చేశాయి.

డాక్టర్ పరమజ్యోతి, డాక్టర్ పూర్ణ బికాసాని, బావ జైన్ లాంటి ప్రముఖులు తమ ప్రసంగాలతో పిల్లలు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపారు. పోటీల్లో విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. బాలల సంబరాలను దిగ్విజయంగా నిర్వహించడంలో టాంపా బే నాట్స్ విభాగం (NATS Tampa Bay Chapter) చక్కటి ప్రణాళిక, కార్యాచరణతో వ్యవహారించి సంబరాలకు విచ్చేసిన వారి ప్రశంసలు అందుకుంది.

బాలల సంబరాలను కేవలం విద్యార్ధుల మధ్య పోటీలుగా మాత్రమే కాకుండా తెలుగు, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరానికి తీసుకెళ్లే వారధిలా నాట్స్ టెంపాబే నిర్వహించడం అభినందనీయమని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అన్నారు. ఈ సంబరాల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు.

బాలల సంబరాల కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ & నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ / మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల,  ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్  సుమంత్ రామినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి యార్లగడ్డ,  మాలినీ రెడ్డి, సతీష్ పాలకుర్తి, సుధాకర్ మున్నంగి, ప్రసాద్ నేరెళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

బాలల సంబరాలకు స్పానర్స్‌గా వ్యవహరించిన మాధవి, శేఖర్ ఎనమండ్ర లను నాట్స్ (North America Telugu Society) నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. సంబరాల్లో కార్యక్రమాలను చక్కగా సమన్వయం చేసిన శ్రీకృతి నేరాల, శ్రీహిత పట్నాయకుని లకు నాట్స్ (NATS) కృతజ్ఞతలు తెలిపింది. బెస్ట్ బ్రైన్స్ నుంచి మ్యాథ్ బౌల్ పోటీలు నిర్వహించిన రజిని మరియు సుధాకర్ లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్ బృహత్ సోమ ని సత్కరించారు. ఈ నాట్స్ బాలల సంబరాలు తెలుగు వారికి మధురానుభూతులు మిగిల్చాయి.

నాట్స్ టాంపా బే ఫ్లోరిడా చాప్టర్ (NATS Tampa Bay Florida Chapter) తరపున బాలల సంబరాల్లో కీలకంగా వ్యవహరించిన నవరసయ్య అకాడమీ చెందిన శ్రీ ఎంఆర్ వేణుపూరి శ్రీనివాస్, మాధురి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ చెందిన గురు మాధురి గుడ్ల, నోరి ,రాగిణి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, డాక్టర్ సబ్రీనా మాడభూషి, సరయు డ్యాన్స్ అకాడమీ, సంధ్యా పేరం, టీమ్ కుందనపు బొమ్మలు, శ్రీచరణి చింతపల్లి, శారద మంగిపూడి , శివం, ఆర్.కె గ్రూప్ డ్యాన్స్ అకాడమీ, సృష్టి డ్యాన్స్ అకాడమీ, స్వప్న కొమ్మరాజు తదితరులు అందించిన సహకారంతో సంబరాలు ఆద్యంతం వినోదభరితంగా సాగాయి.

వివిధ పోటీలలో విజేతల జాబితా
చెస్ విజేతలు:
ప్రాథమిక పాఠశాల:
       1వ: కార్తీక్ మల్లవరపు
       2వ: చేతన్ మెంథెమ్
       3వ: రిశ్వంత్ వసంతకుమార్
మిడిల్ స్కూల్ విజేతలు:
       1వ: శ్రీతన్ శ్రీరామ్
       2వ: అదితి ఇంజేటి
       3వ: ఆహాన్ డోరా

రూబిక్స్ క్యూబ్ విజేతలు:
   1వ: ప్రణవ్ కుమార్ సిరిమల్ల
   2వ: సామాన్యు పోలిపంగు
   3వ: కార్తీక్ దలై

ఆర్ట్ విజేతలు:
   వర్గం 1:
       1వ: కృతి పన్యాలా
       2వ: జే వై
       3వ: జస్వంత్ రెడ్డి
   వర్గం 2:
       1వ: వైగా మీనాక్షి
       2వ: శ్రేయాన్ చిత్త
       3వ: రిశ్వంత్ వసంత్ కుమార్

వర్గం 3:
       1వ: హర్షన్ బుద్ధ
       2వ: సాయి సంజన జగన్
       3వ అదితి ఇంజేటి

గణిత విజేతలు:
   2వ తరగతి:
       1వ: రమేష్ ధ్యాన్
       2వ: సీతే బైరెడ్డి
   3వ తరగతి: 
       1వ: ఆషిక విజయ్ లింగమనేని
       2వ: అంగ ఇంజేటి
   4వ తరగతి:
       1వ: శ్రీ దేవ్ కుమార్ గంటా
       2వ: కార్తీక్ దలై
   5వ తరగతి:
       1వ: సాత్విక్
       2వ: మన్నెపల్లి మానస్ / పొన్నం శీధః
   6వ తరగతి:
       1వ: వంశీ ముప్పాల
       2వ: రాచకొండ ఈషా
   7వ తరగతి:
       1వ: ప్రవర భరద్వాజ్
       2వ: కాకరాల సంకాష్

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected