Connect with us

Kids

ప్రతిభతో ఆకట్టుకున్న చిన్నారులు @ Los Angeles నాట్స్ బాలల సంబరాలు

Published

on

లాస్ ఏంజిల్స్, డిసెంబర్ 6: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ తాజాగా లాస్ ఏంజిల్స్‌ (Los Angeles) లో ఘనంగా బాలల సంబరాలు నిర్వహించింది.

స్థానికంగా ఉండే దాదాపు వెయ్యి మందికి పైగా ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరం కూడా తెలుసుకోవడం, పాటించడాన్ని ప్రోత్సాహించేలా ఈ North America Telugu Society (NATS) బాలల సంబరాలు జరిగాయి.

తెలుగు శాస్త్రీయ, జానపద కళల ప్రదర్శనలు, తెలుగు చలన చిత్రాల్లోని గీతాలపై నృత్యాలు.. ఇలా రకరకాల కళారూపాలతో తెలుగు సాంస్కృతిక మహోత్సవంలా ఈ బాలల సంబరాలు జరిగాయి. చిన్నారుల ప్రదర్శనలకు సభికుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.

ఆద్యంతం ఉర్రూతలూగించే ఎన్నో కార్యక్రమాలతో NATS బాలల సంబరాలు జరిగాయి. స్థానిక తెలుగువారికి తియ్యటి అనుభూతులను పంచాయి. బాలల సంబరాల కోసం వివిధ అంశాల్లో జరిగిన పోటీలు కూడా చిన్నారుల్లో ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలిచాయి.

చదరంగం (Chess) పోటీలు వారిలోని ఆలోచనాశక్తిని పెంచేలా సాగాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత కలబోసి నిర్వహించిన ఫ్యాషన్ షో (Fashion Show) అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇది చిన్నారుల్లో సృజనాత్మకతకు బయటపెట్టింది.

అమెరికా క్రికెట్ టీంలో తెలుగమ్మాయి చేతనారెడ్డికి నాట్స్ సత్కారం

అమెరికాలో తెలుగువారు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అమెరికా క్రికెట్ (Cricket) టీంలో మన తెలుగమ్మాయి చేతనారెడ్డి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా నాట్స్ బాలల సంబరాల వేదికపై చేతనారెడ్డిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి సత్కరించారు. చేతనా రెడ్డి అమెరికాలోని తెలుగువారందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

చేతన క్రికెట్‌లో మరిన్ని విజయాలు సాధించాలని బాపు నూతి ఆకాంక్షించారు. నాట్స్ (NATS) బాలల సంబరాలను దిగ్విజయంగా నిర్వహించిన నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ హెల్ప్ లైన్ సేవల గురించి.. తెలుగువారికి ఏ కష్టమోచ్చినా అది ఎంతగా అండగా నిలుస్తుందని బాపు నూతి వివరించారు.

లాస్ ఏంజిల్స్‌ (Los Angeles) లో బాలల సంబరాలకు హాజరైనందుకు నాట్స్ లాస్ ఏంజిల్స్ బృందం బాపు నూతికి కృతజ్ఞతలు తెలిపింది. నాట్స్ బోర్డు గౌరవ డైరెక్టర్ రవి ఆలపాటి, నేషనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధు బోడపాటి, కృష్ణ కిషోర్ మల్లిన, జోనల్ వైస్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ చిలుకూరితో పాటు వెంకట్ ఆలపాటి, హరి కొంక, కిషోర్ గరికపాటి, వంశీ, మోహన్ గరికపాటి తదితరులు ఈ బాలల సంబరాలకు ఇచ్చిన మద్దతును నాట్స్ లాస్ ఏంజిల్స్ బృందం కొనియాడింది.

లాస్ ఏంజిల్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మనోహర్ రావు మద్దినేని, జాయింట్ కోఆర్డినేటర్ మురళి ముద్దన, బిందు కామిశెట్టి, రాజలక్ష్మి చిలుకూరి, శ్రీనివాస్ మునగాల, లతా మునగాల, పద్మజ గుండ్ల, కిరణ్ ఇమ్మడిశెట్టి, శంకర్ సింగంశెట్టి, నితిత్ సింగం శెట్టి, శ్రీపాల్ రెడ్డి, శ్యామల చెరువు, అనిత కొంక, గురు కొంక, నరసింహారావు రవిలిశెట్టి, తిరు నోముల, సతీష్ ఎలవర్తి, సుధీర్ కోట, అనిత జవ్వాజి, నాగ జ్యోతి ముద్దన, నిహారిక పెండేకంటి, నిరటి పెండేకంటి, ప్రణవ్ ఆలపాటి, ప్రఖ్యాత, తన్మయి ఇమ్మిడిశెట్టి, తనిష్క రాజు తదితరులు ఈ బాలల సంబరాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

బాలల సంబరాలు తమ పిల్లల ప్రతిభ, ప్రదర్శనకు వేదికగా మారడంతో పాటు ఆద్యంతం వినోదాన్ని, ఆనందాన్ని పంచడంతో తెలుగు తల్లిదండ్రులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్ని ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు, పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు నాట్స్ ప్రత్యేకంగా బహుమతులు ప్రదానం చేసింది.

తెలుగు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఈ సంబరాలు జరగడంతో ఈ సంబరాలకు విచ్చేసిన వారంతా హర్షం వ్యక్తం చేసారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ (NATS Los Angeles Chapter) బాలల సంబరాలను ఘనంగా నిర్వహించడంలో పాలుపంచుకున్న నాయకులకు, వాలంటీర్లకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected