Published
1 month agoon
By
NRI2NRI.COMFrisco, Texas, November 22: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా డల్లాస్ లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం (NATS Dallas Chapter) బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది.
బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ (NATS) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డల్లాస్ (Dallas) కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం (NATS Dallas Team) విజయవంతం చేసింది. నాట్స్ బాలల సంబరాలకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi), నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.
డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.
బాలల సంబరాలను జయప్రదం చేసిన జట్టు సభ్యులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, న్యాయనిర్ణేతలకు, దాతలకు, యువ సభ్యులకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi) ధన్యవాదాలు తెలిపారు. ఈ బాలల సంబరాలను పద్నాలుగు సంవత్సరాలక్రితం డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, మరిన్ని నాట్స్ చాఫ్టర్లు ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు.
మన ప్రవాస భారతీయ పిల్లలకు, ప్రత్యేకంగా తెలుగు వారి పిల్లలకు, వారి ప్రతిభను, నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని పెంపొందించే అవకాశాలను కల్పించటం చాలా సంతోషంగా ఉందని బాపు నూతి (Bapu Nuthi) అన్నారు. ఈ బాలల సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుండటంపై బాపు హర్షం వ్యక్తం చేశారు.
స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వోల్డీలక్స్ మరియు ఫార్మ్2కుక్ లకు నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్వజయంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు అధ్యక్షులు మదన్ పాములపాటిలు (Madan Pamulapati) ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నాట్స్ బాలల సంబరాలు 2024 విజేతలు
శాస్త్రీయ నృత్యం (గ్రేడ్ 1-5)
1. ఆయుషి తమన్న
2. అంజలి పెమ్మసాని
3. సాయి తరీఖ గురుస్వామి జయశ్రీ
శాస్త్రీయ నృత్యం (గ్రేడ్ 6-10)
1. లాస్య కొత్తపల్లి
2. బిల్వశ్రీ మాతం
3. రిషిత్ వైటల్ గద్దె
సినీ నృత్యం (గ్రేడ్ 1-5)
1. తేజ్ కార్తీక్ సోము
2. నైనిక ముమ్మనేని
3. సోనిక గద్దె
సినీ నృత్యం (గ్రేడ్ 6-10)
1. లోహిత్య సోము
2. అభిజ్ఞ గరిమెళ్ళ
3. మాన్య జొన్నాదుల
శాస్త్రీయ సంగీతం – గీతమ్స్
1. అన్విక ఆలపర్తి
2. ఇషితా సుబ్రమణియం ఎర్రగుంట్ల వెంకట
3. యతినారాయణ నజన
శాస్త్రీయ సంగీతం – కీర్తనాస్
1. లాస్య కొత్తపల్లి
2. విష్ణు ప్రియ కృష్ణన్
3. బిల్వశ్రీ మాతం
శాస్త్రీయ సంగీతం – వర్ణమ్స్
1. విష్ణు ప్రియ కృష్ణన్
2. బిల్వశ్రీ మాతం
3. ఉదయ్ వొమరవెల్లి
సినీ సంగీతం (<= 8 సం.)
1. ధన్వి శ్రీ ముప్పలనేని
2. శ్రీఖిత ఉండమట్ల
3. ఆర్న దాసరి
సినీ సంగీతం (గ్రేడ్ 1-10)
1. లాస్య కొత్తపల్లి
2. బిల్వశ్రీ మాతం
3. లాస్య కొత్తపల్లి
శాస్త్రీయ నృత్యం – గ్రూప్
1. భవనాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి
2. సాయినాథ్ స్కూల్ ఆఫ్ డాన్స్
సినీ నృత్యం – గ్రూప్
1. గోల్డెన్ గర్ల్స్
2. అనిత డాన్స్ స్కూల్
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 1st గ్రేడ్
1. అక్షర పోచం
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 2nd గ్రేడ్
1. అర్జున్
2. శ్రీయాన్ పెద్ది
3. గీతాన్స్
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 3rd గ్రేడ్
1. రుత్విక్ బొద్దపు
2. రుత్విక్ శ్రీనివాసన్
3. ప్రనీల్ ఆకుల
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 4th గ్రేడ్
1. జై పోటు
2. ఉద్భవ్ ఉరవకొండ
3. తేజ్ కార్తీక్ సోము
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 5th గ్రేడ్
1. తపస్య
2. జై ఉమరవెల్లి
3. విశ్వన్ బియ్యపు
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 6th గ్రేడ్
1. శ్రీనిధి యలవర్తి
2. విశ్వత్ జూపల్లి
3. దేవనీత్ పాకలపాటి
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 7th గ్రేడ్
1. ఉదయ్ వొమరవెల్లి
2. ఆశ్రిత గోకరకొండ
3. సహస్ర కొత్తపల్లి
మ్యాథ్స్ ఛాలెంజ్ పోటీ – 8th గ్రేడ్
1. సహస్ర చెన్నభక్తుల
2. సాయి చైత్ర గోన
3. అమితేష్
తెలుగు పదజాలం పోటీ (గ్రేడ్ 1-5)
1. శ్రీనిజ యలవర్తి
2. జై వొమరవెల్లి
3. శ్రీనిక చల్లా
తెలుగు పదజాలం పోటీ (గ్రేడ్ 6-10)
1. ఉదయ్ వొమరవెల్లి
2. శ్రీనిధి యలవర్తి
3. ఆశ్రిత గోకరకొండ
తెలుగు ఉపన్యాసం పోటీ (గ్రేడ్ 1-5)
1. శ్రీనిక చల్లా
2. శ్రీహిత గోకరకొండ
తెలుగు ఉపన్యాసం పోటీ (గ్రేడ్ 6-10)
1. ఆశ్రిత గోకరకొండ
2. చంద్రార్క్ శిష్ట్లా
3. శ్రీనిధి యలవర్తి
చదరంగం పోటీ – ఛాంపియన్ షిప్
నేషనల్ ఛాంపియన్ – ఫైడ్ మాస్టర్ ఆర్యన్ గుట్ల
1. ఆర్యన్ ఉయ్యూరు
2. శ్రీయన్ ఉయ్యూరు
3. చంద్ర బూబతి
4. కార్తీ కొత్త
5. తపస్య కారి
చదరంగం పోటీ – U900
1. ఉదయ బూబతి
2. ఒమర్ మహాసూమ్
3. సరయు తలపనేని
4. విహాన్ జైన్
చదరంగం పోటీ – U600
1. తనీష్ నైరి
2. ఉదయ్ వొమరవెల్లి
3. అద్వైత్ నారె
4. కార్తికేయ క్యాస
చదరంగం పోటీ – U400
1. జాశ్రిత కందికొట్టు
2. ధన్విత్ కొత్త
3. వేదిక్ రాంకుమార్
4. దేవాన్ష్ సాయి ముల్లపనేని