Edison, New Jersey: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీ (New Jersey) లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై వాక్ అండ్ టాక్ ఈవెంట్ నిర్వహించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మాసంగా భావించి దానిపై చైతన్యం తీసుకొస్తుంటారు.
దీనిలో భాగంగానే నాట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పై తెలుగువారిని అప్రమత్తం చేసేందుకు ఈ వాక్ అండ్ టాక్ (Walk & Talk) నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ పాస్ట్ చైర్ ఉమన్ అరుణ గంటి లు సారథ్యం వహించారు. న్యూజెర్సీ (New Jersey) లో స్థానిక తెలుగు వైద్యులు బ్యూలా విజయ కోడూరి, చరిష్మా భీమినేనిలు ఇందులో పాల్గొని విలువైన సూచనలు చేశారు.
ప్రతీ ఎనిమిది మంది మహిళలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) నిర్ధారణ అవుతున్న ఈ రోజుల్లో, బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా గుర్తించాలి..? బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను, 40 ఏళ్ళ వయసు దాటిన స్త్రీలకు మామోగ్రామ్ (Mammogram) పరీక్ష యొక్క అవశ్యకతను ఈ ఈవెంట్‌లో చక్కగా వివరించారు. క్యాన్సర్‌పై మహిళల సందేహాలను నివృత్తి చేశారు.
తెలుగువారి కోసం న్యూజెర్సీ (New Jersey) లో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) అన్నారు. అన్నింటి కంటే ఆరోగ్యం చాలా విలువైనదని.. దానిని కాపాడుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలని మందాడి కోరారు. రోజు వారీ బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్లే అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అన్నారు.
ఈ సమయంలో తెలుగువారిని ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసేందుకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు NATS ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించామని శ్రీహరి మందాడి తెలిపారు. న్యూ జెర్సీ నాట్స్ నాయకులు రాజ్ అల్లాడ, మురళీకృష్ణ మేడిచెర్ల (Murali Medicherla), కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణసాగర్ రాపర్ల, హరీష్ కొమ్మాలపాటి, రామకృష్ణ బోను పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society – NATS) బోర్డ్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti), నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి తోపాటు నాట్స్ న్యూజెర్సీ ఉమెన్ యెంపవర్మెంట్ టీమ్ శ్రీదేవి జాగర్లమూడి, ప్రణీత పగిడిమర్రి, ప్రసూన మద్దాలి, శ్రీదేవి పులిపాక, ఇందిరా శ్రీరామ్, స్వర్ణ గడియారం, గాయత్రి చిట్టేటి ఈవెంట్ విజయవంతంలో కీలకపాత్ర వహించారు.
బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) పై అవగాహన కొరకు వాక్ అండ్ టాక్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని (NATS New Jersey Chapter) నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేకంగా అభినందించారు.