Connect with us

News

స్పీడు పెంచిన NATS; ఘనంగా Atlanta Chapter ప్రారంభం @ Cumming, Georgia

Published

on

Atlanta, జూన్ 30, 2024: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అమెరికా అంతటా అంచలంచలుగా విస్తరిస్తుంది. 2009 లో ప్రారంభం అయిన నాట్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వివిధ శాఖలను ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే.

ఇప్పుడు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) నాయకత్వంలో కొంచెం స్పీడు పెంచి మరిన్ని రాష్ట్రాల్లో నాట్స్ శాఖలను ఏర్పాటు చేసే పనిలో నాట్స్ నాయకత్వం నిమగ్నమైంది. మూడు వారాల క్రిందట కొత్తగా ఫీనిక్స్ చాప్టర్‌ (NATS Phoenix Chapter) ని కోలాహలంగా ప్రారంభించారు.

ఈ వారాంతం జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా (Atlanta) మహానగరంలో కొత్త శాఖ (NATS Atlanta Chapter) ను ప్రారంభించారు. అట్లాంటా ప్రముఖులు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది (Suresh Peddi) ఆధ్వర్యంలో కమ్మింగ్ పట్టణం లోని ఫవులర్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ (Fowler Park Recreation Center) లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఒకే నెలలో రెండు కొత్త చాఫ్టర్లను విజయవంతంగా ఏర్పాటు చేయడం నాట్స్ కే చెల్లింది. టాంపా నుండి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, చికాగో నుండి అధ్యక్షులు మదన్ పాములపాటి, డల్లాస్ నుండి తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (Bapu Nuthi) మరియు న్యూ జెర్సీ నుండి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) స్వయంగా అట్లాంటా చాప్టర్ లాంచ్ లో పాల్గొనడం విశేషం.

ముందుగా బాల కంచర్ల (Bala Kancharla) అందరికీ స్వాగతం పలికారు. నాట్స్ (North America Telugu Society) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది స్థానిక అట్లాంటా తెలుగు సంఘం TAMA లో చేసిన సేవలను మరియు తెలుగు కమ్యూనిటీకి గత కొన్ని సంవత్సరాలుగా చేసిన సేవలను మననం చేశారు. అనంతరం సురేష్ పెద్ది ని వేదిక మీదకు ఆహ్వానించారు.

సురేష్ పెద్ది స్వాగతోపన్యాసం గావించి, నాట్స్ జాతీయ నాయకులను (NATS National Leaders) మరియు అట్లాంటా చాప్టర్ వాలంటీర్లను ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన గావించారు. తర్వాత నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు మదన్ పాములపాటి, తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

వీరందరూ తమ ప్రసంగంలో నాట్స్ ఏర్పాటు, విజన్, అటు ఇండియా ఇటు అమెరికాలో నాట్స్ చేసే సేవా కార్యక్రమాలు వంటి విషయాలను వివరించి అట్లాంటా చాప్టర్ (NATS Atlanta Chapter) ని వేగంగా ముందుకు నడిపించేలా సహకరించాలని కోరారు. మున్ముందు నాట్స్ కన్వెన్షన్ నిర్వహించేలా దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా వీరు అట్లాంటా నాట్స్ విభాగ నాయకులను అభినందించారు.

బాల కంచర్ల వందన సమర్పణ చేస్తూ… ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రవాసులు, తానా, ఆటా, నాటా, టిటిఎ, ఆప్త, NRIVA వంటి తోటి జాతీయ తెలుగు సంస్థల (National Telugu Associations) ప్రతినిధులు, అలాగే తామా, గాటా, గేట్స్ వంటి స్థానిక తెలుగు సంస్థల (Local Telugu Associations) ప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన నాట్స్ వాలంటీర్స్ లో బాల కంచర్ల, అభిలాష్ ఈడుపుగంటి, శిల్ప కోనేరు, ఠాగూర్ కోనేరు, నాగరాజు మంతెన, లోహిత్ మంతెన, శశిధర్ ఉప్పల, వంశీకృష్ణ ఈర్ల, శ్రీనివాస్ ఎడ్లపల్లి, ప్రసాద్ కల్లి, అనంత్ వాసిరెడ్డి, శివ మామిళ్ళ, శ్రీనివాస్ గోగినేని, సతీష్ అరెకట్ల తదితరులు ఉన్నారు.

తేనీటి విందు అనంతరం కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా టీ అండ్ స్నాక్స్ అందించిన శ్రీ కృష్ణ విలాస్ అధినేత సతీష్ ముసునూరి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS అట్లాంటా చాప్టర్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/NATS Atlanta Chapter Launch in Cumming Georgia ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected