Connect with us

Achievements

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడు, ఇతర తెలుగు పద్మాలకు NATS అభినందనలు

Published

on

వేల మందికి ప్రాణదానం చేసిన వైద్యులు, క్యాన్సర్‌ వైద్యంలో ప్రపంచ ప్రసిద్ధుడైన మన తెలుగుబిడ్డ డా. నోరి దత్తాత్రేయుడికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ (Padma Bhushan) పురస్కారం ప్రకటిండంపై నాట్స్ (NATS) హర్షం వ్యక్తం చేసింది. ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) అన్నారు. పద్మ పురస్కారాలు వరించిన తెలుగువారందకి నాట్స్ అభినందనలు తెలిపింది.

అమెరికాలో కూడా డాక్టర్ నోరి (Dr. Dattatreyudu Nori) సేవలకు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాయని.. వేల మందికి ఆయన ప్రాణదాతగా నిలిచారని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ సినీ నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్ (Gadde Rajendra Prasad), మాగంటి మురళీమోహన్‌ (Maganti Murali Mohan) లకు పద్మ పురస్కారాలు (Padma Award) వరించడం వారి నటనా ప్రతిభకు, కళా రంగానికి చేసిన సేవలకు అసలైన గుర్తింపు అని నాట్స్ కొనియాడింది.

అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ (Science & Engineering) లో కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, వైద్యంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకటరావు, కళల్లో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్) రామారెడ్డి మామిడి (మరణానంతరం) – పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, వెంపటి కుటుంబ శాస్త్రి – సాహిత్యం, గూడూరు వెంకటరావు – వైద్యం, దీపికా రెడ్డి – నృత్యకారిణి, గడ్డమనుగు చంద్రమౌళి (Chandramouli Gaddamanugu) – సైన్స్ విభాగాలలో పద్మశ్రీ (Padma Shri) వరించిన అందరిని నాట్స్ (NATS) హృదయపూర్వకంగా అభినందించింది.

error: NRI2NRI.COM copyright content is protected