Connect with us

Schools

Vizag, Gajuwaka పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో, MLA పల్లా ప్రారంభం

Published

on

Gajuwaka, Visakhapatnam, December 14: జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. నాట్స్, రోటరీ క్లబ్ విశాఖపట్నం (Vizag) సౌత్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (GLOW) ల సహకారంతో.. గాజువాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చేయూతనిచ్చింది.

చట్టనువాలి పాలం, పాత గాజువాక, డ్రైవర్స్ కాలనీ పాఠశాలల్లోని చిన్నారుల భవిష్యత్తు కోసం లక్ష రూపాయల విలువైన టీచింగ్ మెటీరియల్‌ను నాట్స్(NATS) అందించింది. చిన్నారులు ఆటపాటలతో నేర్చుకునేందుకు వీలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చార్ట్‌లు, ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు గ్లోబ్‌లు, ఆట వస్తువులను పంపిణీ చేశారు.

కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, సృజనాత్మకతను పిల్లల్లో పెంచేందుకు నాట్స్ తోడ్పడింది. గ్రీన్ స్టూడియో (Green Studio) కాన్సెప్ట్‌ కు నాట్స్ ఆర్ధిక మద్దతు అందించింది. డ్రైవర్స్ కాలనీ చుట్టుపక్కల ఉన్న ఏకంగా తొమ్మిది పాఠశాలలను దత్తత తీసుకున్న నాట్స్, చిన్నారుల్లోని అపారమైన నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ గ్రీన్ స్టూడియో పనిచేయనుంది.

నడుపూరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో… విద్యార్థులు తమ భావాలను, ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఒక వేదిక కానుంది. గాజువాకలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు.

పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) అన్నారు. నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ కార్య నిర్వాహక సభ్యులు కిరణ్ మందాడి (Kiran Mandadi) వివరించారు.

ఈ గ్రీన్ స్టూడియో భవిష్యత్తులో అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని గ్లో సెక్రెటరీ యార్లగడ్డ వెంకన్న చౌదరి (Yarlagadda Venkanna Chowdary) అన్నారు. గ్రీన్ స్టూడియో కాన్సెప్ట్ వినూత్నంగా ఉందని కొనియాడుతూ, దీనిని నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని ఎంఈఓకి స్థానిక MLA పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో (Green Studio) ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) సభ్యులు, రోటరీ క్లబ్ మెంబర్స్, స్కూల్ టీచర్స్, ఎంఈఓ, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected