Tampa, Florida: నార్త్ అమెరిగా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) ఫ్లోరిడా లోని టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జులై 4,5,6 మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 8వ అమెరికా తెలుగు సంబరాలలో భాగంగా నిన్న రెండవ రోజు కూడా కార్యక్రమాలన్నీ అత్యంత ఘనంగా నిర్వహించారు.
జులై 5 శనివారం ఇనాగరల్ ప్రోసెషన్ (Inaugural Procession) లో నాట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులతో భక్తి పారవశ్యంతో ప్రారంభమైన నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలలో శ్రీనివాస కల్యాణానికి నందమూరి బాలక్రిష్ణ మరియు సతీమణి నందమూరి వసుంధర హాజరయ్యారు.
ముందుగా నందమూరి బాలక్రిష్ణ మరియు నాట్స్ కన్వీనర్ & పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) మరియు నాట్స్ ప్రస్తుత బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) సారధ్యంలోని నాట్స్ లీడర్షిప్ జ్యోతి వెలిగించి రెండో రోజు సంబరాలను ప్రారంభించారు.
ఈ సమయంలో సినీనటులు తనికెళ్ళ భరణి రచించిన పుస్తకాన్ని నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna) ఆవిష్కరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం ఆసాంతం ఉంది ప్రసాదం, ఆశీస్సులు తీసుకొని వెళ్లడం బాలక్రిష్ణ గొప్పతనం.
లంచ్ బ్రేక్ తర్వాత లోకల్ టాలెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), అష్టావధానం వంటి సాహితీ సమావేశాలు, ఇంజనీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థుల సమావేశం, ఆర్ధిక, రియల్ ఎస్టేట్, యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలు బ్రేకౌట్ రూమ్స్ లో సాగాయి.
రోజంతా తెలుగువారు వెండర్ బూత్స్ (Shopping Stalls) దగ్గిర కలియ తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం టాప్ నాచ్ డాన్స్ స్కూల్స్ నుంచి ప్రదర్శించిన కార్యక్రమాలు బాగున్నాయి. బాంక్వెట్ డే కంటే చాలా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ రోజు విచ్చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంట్రీ అదిరిపోయింది. ఫ్యాన్స్ కోలాహలం మధ్య అతి కష్టం మీద వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. అలాగే హీరోయిన్స్ శ్రీలీల (Sreeleela), ఫరియా అబ్దుల్లా, జయసుధ, దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్ విచ్చేసారు.
నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), బన్నీ వాసు, టీజీ విశ్వప్రసాద్, నవీన్ యెర్నేని, నటులు సాయికుమార్, రాజకీయ నాయకులు నాదెండ్ల మనోహర్, రఘురామ కృష్ణం రాజు (RRR), వసంత కృష్ణ ప్రసాద్, కామినేని శ్రీనివాస్, గౌతు శిరీష, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, చదలవాడ అరవింద బాబు, కావలి గ్రీష్మ, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, రాజేష్ అప్పసాని వంటి వారు కూడా పాల్గొన్నారు.
ఇంకా డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్, నటులు అమ్మర్దీప్ చౌదరి, ముక్కు అవినాష్, సుజాత, రాకేష్, అరియనా, రీతు చౌదరి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అమ్మర్దీప్, అరియనా, అశు రెడ్డి, రీతు చౌదరి కలిసి చేసిన డాన్స్ బాగుంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) చేసిన టాలీవుడ్ మెడ్లీ క్రౌడ్ ని అలరించింది.
డాక్టర్ గురవారెడ్డి (A. V. Gurava Reddy) వంటి పలువురు ప్రముఖులకు NATSఅవార్డులు అందజేశారు. అలాగే దాతలకు, స్పాన్సర్స్ కి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్ కుటుంబాన్ని, నటులు సాయికుమార్ ని ఘనంగా సత్కరించిన అనంతరం వారు కాసేపు ప్రసంగించారు.
నాట్స్ (NATS) కార్యవర్గం, బోర్డు సభ్యులను పేరుపేరునా వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) మరియు నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) ప్రసంగించారు.
ఎప్పటిలానే తనకు వెన్నతో పెట్టిన విద్య లాంటి వ్యాఖ్యానంతో యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi) స్టేజ్ కార్యక్రమాలను చక్కగా నడిపించారు. ముఖ్య అతిథి అల్లు అర్జున్ ప్రసంగంతోపాటు పుష్ప సినిమా (Pushpa Movie) లోని డైలాగులు చెప్పి సభికులను ఉత్సాహపరిచారు. తదనంతరం నాట్స్ (NATS) నాయకులు అల్లు అర్జున్ ని ఘనంగా సత్కరించారు.
క్లైమాక్స్ లో తెలుగు సినీ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజికల్ షో సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్ అనేలా సాగింది. దేవి శ్రీ ప్రసాద్ డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ మధ్య మధ్యలో మాటలు చెబుతూ ఇంటరాక్టివ్ గా చాలా చక్కగా అలరించారు. తన కూడా వచ్చిన ట్రూప్ కూడా మంచి డాన్సులతో, పాటలతో కుమ్మేశారు.
ముఖ్యంగా యువత DSP Love You అంటూ కేజ్రీగా కేరింతలు కొట్టారు. రాత్రి ఒంటి గంటకు కూడా హౌస్ ఫుల్, యూత్ స్టేజి ముందుకు వచ్చి కేరింతలు కొట్టారంటేనే తెలుస్తుంది, అందరూ ఎంతలా ఆస్వాదించారో. వందన సమర్పణతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల రెండవ రోజు ఘనంగా ముగిసింది.
దీంతో 3 రోజుల నాట్స్ (North America Telugu Society) అమెరికా తెలుగు సంబరాలలో (NATS 8th Convention) మొదటి రెండు రోజులు విజయవంతంగా ముగిసినట్లయింది. ఇక ఈరోజు గ్రాండ్ ఫినాలే కోసం తెలుగు ప్రవాసులందరూ ఏంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.