నార్త్ అమెరిగా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) మే 26,27,28 మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 7వ అమెరికా తెలుగు సంబరాలలో భాగంగా నిన్న రెండవరోజు కూడా కార్యక్రమాలన్నీ ఘనంగా ముగిశాయి.
శనివారం ఇనాగరల్ ప్రోసెషన్ లో నాట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులతో భక్తి పారవశ్యంతో ప్రారంభమైన నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలు (Conference) ఇంజనీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థుల సమావేశం, నటీనటులతో మీట్ అండ్ గ్రీట్, దీపిక ముత్యాల తో బ్యూటీ ప్యానెల్ వంటి కార్యక్రమాలతో ముందుకు సాగాయి.
వివిధ రూమ్స్ లో ఇమ్మిగ్రేషన్, వ్యాపార, సాహితీ సదస్సులు వంటి కార్యక్రమాలు నడుస్తుండగా, మెయిన్ స్టేజిపై అన్నమాచార్య కీర్తనలు, భగవద్గీత చాంటింగ్, కమిటీలు మరియు డోనార్స్ సన్మానం, నటీనటుల పెర్ఫార్మన్సెస్, ఎడిసన్ మేయర్ ప్రసంగం, ఆస్కార్ (Oscar) అవార్డు విన్నర్ చంద్రబోస్ కి సన్మానం వంటి ప్రోగ్రామ్స్ సాగాయి.
రెండవరోజు కూడా సినీ (Tollywood) దర్శకులు గోపిచంద్ మలినేని, బి గోపాల్, కోదండరామిరెడ్డి, అవసరాల శ్రీనివాస్, యువ హీరోలు ఆది సాయికుమార్, సుధీర్ బాబు, సుశాంత్, డాన్స్ మాస్టర్ సత్య, హిరోయిన్లు సంయుక్త మీనన్, హెబ్బా పటేల్, నేహాశెట్టి, మన్ర చోప్రా, రుహాని శర్మ సంబరాల్లో సందడి చేశారు.
అలాగే బిగ్ బాస్ విన్నర్స్ సన్నీ, బిగ్ బాస్ 4 ఆర్టిస్టులు సోహైల్, హిమజ, శివజ్యోతి, జోర్ధార్ సుజాత, జబర్థస్త్ రాకేశ్, ముక్కు అవినాశ్, టీవీ ఆర్టిస్టులు ప్రియ, సోనియా చౌదరి, సాహిత్య, రజిత, జయలక్ష్మి, ప్రవీణ కడియాల, ప్రముఖ నటి మంజుభార్గవి, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి సంబరాలలో కనిపించారు.
రోజంతా తెలుగువారు షాపింగ్ బూత్స్ (Shopping Stalls) దగ్గిర కలియతిరుగుతూ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలతో ప్రోగ్రాం షెడ్యూల్ టైట్ వా ఉండడంతో నివధికంగా సంబరాలను నిర్వహించినప్పటికీ కొంచెం డిలే జరిగినట్టు తెలిసింది.
ప్రైమ్ టైం లో తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ని ఘనంగా సన్మానించారు. అనంతరం సంగీత స్వరబ్రహ్మ, టాలీవుడ్ సంగీత దర్శకులు మణిశర్మ (Mani Sharma) వేదికనలంకరించి పాటలతో ఆహ్వానితులను సంగీత ప్రపంచంలో విహరింపజేశారు.
తెలుగమ్మాయి ఫైనల్స్ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో 3 రోజుల నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలో (NATS 7th Convention) మొదటి రెండు రోజులు విజయవంతంగా ముగిసినట్లయింది. ఈరోజు గ్రాండ్ ఫినాలే కోసం తెలుగువారందరూ ఆతృతగా వేచిచూస్తున్నారు.