Connect with us

Associations

నేటి నాటా గాయకులే రేపటి సినీ గాయకులు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ మహాసభలు జులై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నాటా ఐడోల్ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో జూన్ 2 నుండి జులై 1 వరకు నిర్వహిస్తున్నారు. అమెరికాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రాంతీయ గాయనీగాయకుల ప్రతిభను వెలికితీయడమే నాటా ఐడోల్ ముఖ్య ఉద్దేశం. సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ నాటా మహాసభలలో నిర్వహించబడును. ఇందులో గెలిచినవారికి తెలుగు సినిమాలో పాట పాడే అవకాశం లభించును. నేటి నాటా గాయకులు రేపటి సినీ గాయకులు కావాలంటే www.nata2018.org లో నమోదు చేసుకోండి లేదా నాటా ఐడోల్ జట్టు సభ్యులు నీలిమ గడ్డమణుగు గారిని సంప్రదించండి.

error: NRI2NRI.COM copyright content is protected