Connect with us

News

Las Vegas: హరినాథ్ రెడ్డి వెల్కూర్‌ అధ్యక్షునిగా NATA నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

Published

on

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (North American Telugu Association – NATA) నూతన కార్యవర్గ సభ్యులు మరియు బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. గత వారాంతం లాస్ వేగాస్ (Las Vegas) లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.

ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) అధ్యక్షునిగా హరినాథ్ రెడ్డి వెల్కూర్‌ (Harinath Reddy Velkur), ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా రామిరెడ్డి ఆళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నారాయణ రెడ్డి గండ్ర మరియు పలువురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛార్జ్ తీసుకున్నారు.

అలాగే కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి ఈమని, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసులు రెడ్డి కొట్లూరు, కోశాధికారిగా శ్రీకాంత్ పెనుమాడ, సంయుక్త కోశాధికారిగా రాధాకృష్ణా రెడ్డి కలువాయి ప్రమాణస్వీకారం చేసినవారిలో ఉన్నారు. వీరంతా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Sridhar Reddy Korsapati) కార్యవర్గం నుంచి బాధ్యతలు స్వీకరించారు.

ఇందులో భాగంగా 2024 – 2027 కాలానికి బోర్డు సభ్యులుగా అట్లాంటా (Atlanta) నుంచి ప్రముఖులు శ్రీనివాసులు రెడ్డి కొట్లూరు, మాధవి ఇందుర్తి మరియు వెంకట్ దుగ్గిరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కమ్యూనిటీ సర్వీస్ ఛైర్ గా రాజేష్ తడికమళ్ల సేవలందించనున్నారు.

రెండు రోజులపాటు లాస్ వేగాస్ (Las Vegas) లో నిర్వహించిన బోర్డు సమావేశం అనంతరం నాటా ఫౌండర్ డా. ప్రేమ్ సాగర్ రెడ్డి (Dr. Prem Sagar Reddy), డా. రాఘవరెడ్డి గోశాల, డా. ఆదిశేషారెడ్డి బెల్లం వంటి పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యుల మరియు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది.

అమెరికా నలుమూలల నుండి నాటా (NATA) నాయకులు ఈ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించేలా నాటా సంస్థను మరింత ముందుకు తీసుకెళుతుందని ఆశిస్తూ కొత్తగా ఎన్నికైన నాటా నాయకత్వ బృందానికి NRI2NRI.COM నుంచి హృదయపూర్వక అభినందనలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected