మూడు రోజుల నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (NATA) మహాసభలలో భాగంగా రెండవ రోజు అయిన నిన్న జులై 1 శనివారం రోజున టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ (S Thaman) ఆహ్వానితులందరినీ ఉర్రూతలూగించింది.
వివరాలలోకి వెళితే మొన్న శుక్రవారం బాంక్వెట్ డిన్నర్ తో నాటా (North American Telugu Association) కన్వెన్షన్ అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అదే జోష్ తో రెండవ రోజు కూడా నాటా కన్వెన్షన్ విజయవంతంగా ముగిసింది.
రెండవ రోజు ఉదయాన్నే పూజతో ప్రారంభించి నాటా (North American Telugu Association) అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి అందరికీ ఆహ్వానం పలుకుతూ కాసేపు ప్రసంగించారు. పండితులు నాటా నాయకులను వేద వచనాల నడుమ ఆశీర్వదించారు.
నాటా (NATA) వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి (Dr. Prem Sagar Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. ఆదిశేషారెడ్డి, కల్చరల్ ఛైర్ & నాటా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి దర్గా తదితరులు కూడా ప్రసంగించారు.
డల్లాస్ నగర మేయర్ (Mayor) నాటా కన్వెన్షన్ సందర్భంగా పంపిన ప్రొక్లమేషన్ (Proclamation) ని సభాముఖంగా నాగిరెడ్డి దర్గా చదివి వినిపించారు. యాంకర్ సరదాగా అడిగిన ప్రశ్నలకు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి తన సమాధానాలతో సభికులను నవ్వించారు.
ఈ సందర్భంగా వివిధ థీమ్స్ తో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. సమాంతరంగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్ (Exhibit Rooms)) లో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్యమైన వాటిలో శంకరనేత్రాలయ మీట్ అండ్ గ్రీట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్ తో మీడియాముఖాముఖీ, మిల్లెట్ మ్యాన్ పద్మశ్రీ ఖాదర్ వలి ఆహార సదస్సు, మాట్రిమోనియాల్ సర్వీసెస్, నాటా ఐడల్ & బ్యూటీ పేజెంట్ సెమీఫైనల్స్ & ఫైనల్స్, రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తో ఆత్మీయ సమావేశం ఉన్నాయి.
అలాగే ఉమెన్స్ ఫోరమ్, సాహితీవేత్తల సమావేశాలు, వివిధ కళాశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు (Alumni Meets) కూడా నిర్వహించారు. డా. ప్రేమ్ సాగర్ రెడ్డి మరియు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్ ని మెయిన్ వేదిక మీదకు తోడ్కొని వచ్చారు.
రవి శంకర్ (Art of Living Ravi Shankar) స్ట్రెస్, రిలాక్సేషన్, కాంనెస్, మైండ్ స్టెబిలిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of Living) ఫాలోవర్స్ ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివిధ కమిటీల సభ్యులను వేదికపై కొనియాడారు. సినీ నటులు ఆలీ (Mohammad Ali) 45 సంవత్సరాల సినీ కెరీర్ ని పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలీ, యాని మాస్టర్ (Anee Master) విడివిడిగా వేదికపై పాటలకు డాన్స్ చేసి అందరినీ అబ్బురపరిచారు.
అలాగే సినీ నటి డా. మంజు భార్గవి, వైసీపీ నాయకులు & టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి, నాటా (NATA) పాత అధ్యక్షులను సన్మానించారు. మధు గొనిపాటి నాటా ఐడల్ 2023 విజేతలను ప్రకటించగా పెద్దలు బహుమతులు అందజేశారు. యాత్ర 2 సినిమా టీజర్ ని ఆవిష్కరించారు.
షాపింగ్ స్టాల్ల్స్ లో మహిళలు తమ అభిరుచుల మేరకు కలియతిరిగారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం & సాయంత్రం డిన్నర్ సర్వ్ చేశారు. నాటా సభలకు హాజరైన వారందరూ వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ (Photo Booth) ల దగ్గిర ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు.
రవి మరియు వర్షిణి ల యాంకరింగ్ ఆకట్టుకుంది. చివరిగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ (S Thaman) ట్రూప్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఒక టైం లో చిన్నలు, పెద్దలు అందరూ వేదిక ముందుకు వచ్చి డాన్సులు చేశారు.