Connect with us

Devotional

అట్లాంటాలో కన్నుల పండుగలా దేవదేవుని కళ్యాణం: NATA, APNRT, TTD, Hindu Temple of Atlanta

Published

on

అమెరికాలోని అట్లాంటా నగరం లో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (నాటా) మరియు APNRT అద్వర్యం లో HTA వారి సహకారం తో జులై 9వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది.

టీటీడీ కళ్యాణం కార్యనిర్వాహకవర్గం సభ్యులు అయిన శ్రీనివాసులు రెడ్డి కొట్లూరి, నంద గోపి నాథ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతం, బలరామి రెడ్డి వల్లూరి, శేషు కుమార్ వినకొళ్ళు, రఘునాథ రెడ్డి, వెంకట్ బూచి, వెంకట్ పబ్బులేటి ,రాం రెడ్డి , HTA కార్యవర్గ కమిటీ మరియు నిరంజన్ ప్రొద్దుటూరు, మద్ద బాలా, కిషన్ తాళ్లపల్లి మరియు వారి మిత్ర బృందం, వాలంటీర్లు సహకారం తో స్వామి వారి కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయము చేసారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన అర్చకస్వాములు, వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా కార్య వర్గం వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి కన్నుల పండుగలా తరించారు, భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.

అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నోచుకోని వేలాది మంది భక్తుల కొరకు అమెరికాలో కళ్యాణోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే.

దాదాపుగా 100 సభ్యులతో కూడిన గాన బృందం వారు అన్నమయ్య కీర్తన ల తో ఈ వివాహ మహోత్సవం జరిగినది. ఈ మహోత్సవం గోవింద నామాలతో ముగిసింది.
ఈ కీర్తనలో పాల్గొన్న శ్రీమతి స్వాతి కారి, శాంతి మేడిచర్ల, శ్రీవల్లి కంసాలి, రామ్ దుర్వాసుల, అంజనేయ శాస్రి, వరేణ్య మరియు స్కంధ భరద్వాజ్ గారికి ధన్యవాదములు.

దేవ దేవుడు శ్రీ శ్రీనివాసుడి కరుణ కటాక్షము, దానిలో వేలాది భక్తులు పాలు పంచుకోవడం చాలా గొప్ప అదృష్టం గా అత్యంత సంతృప్తిని ఇచ్చిందని నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ అట్లాంటా టీం (NATA), APNRT మరియు HTA కార్యవర్గ బృందం తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీదర్ కొరసపాటి మరియు నాటా నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి తో పాటు, SVBC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, TTD AEO బి. వెంకటేశ్వర్లు, YSRCP USA గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నంద గోపి నాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫోటోల కొరకు రవి కిరణ్ వడ్డమాను ఫోటోగ్రఫీ లింక్ ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected