Connect with us

Birthday Celebrations

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో కోలాహలంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

Published

on

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశాకిరణం, నగదు బదిలీ పధకం రూపకర్త యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు టీడీపీ ఐర్లాండ్ విభాగం సభ్యుల ఆధ్వర్యంలో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో ఘనంగా జరిగాయి. ముందుగా టీడీపీ ఐర్లాండ్ విభాగం సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త విశ్వవిక్యాత నటసార్వాభౌమ స్వర్గీయ ప్రద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు గారి విగ్రహనికి నివాళులు అర్పించారు.

అనంతరం రాబోయే తరానికి కాబోయే నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా, రాష్ట్ర మంత్రిగా అయన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి అయన మంత్రి వర్గంలో అయన తెచ్చిన అవార్డులు రివార్డ్ ల గురించి, పరిశ్రమల శాఖ మంత్రిగా వివిధ దేశాలకు వెళ్లి తెచ్చిన పరిశ్రమల గురించి వక్తలు మననం చేసుకున్నారు.

ఆ తరువాత కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఉన్నత చదువుల కోసం యూరప్ లోని వివిధ దేశాల నుండి వచ్చి తెలుగుదేశం పార్టీ ఐర్లాండ్ విభాగం ద్వారా యూరప్ లోని వివిధ దేశాలలో ఉన్నత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మరియు ఐర్లాండ్ టీడీపీ విభాగం ద్వారా పొందిన సహాయ సహకారాల గురించి లబ్ది పొందిన వారు తమ అనుభూతులను పంచుకున్నారు.

తదనంతరం యువ నాయకుడు లోకేష్ త్వరలో చేపట్టబోయే సుదీర్ఘ పాదయాత్ర యువగళం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యి తెలుగుదేశం పార్టీ ని విజయతీరాలకు చేర్చాలని కోరుకుంటూ ధృడమైన ఆశాభావం వ్యక్తం చేసి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించి యువగళం వాల్ పోస్టర్ ని ఆవిష్కరణ చేశా రు.

ఉదయం 11 గంటలకు మొదలు అయిన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు వందల మంది ఐర్లాండ్ విభాగం సభ్యులు, మహిళలు, యువత మధ్య అధ్యంతం ఆహ్లాదకరంగా ఎంతో ఉత్సాహంతో సాగింది. ఈ కార్యక్రమం మొత్తం Dr. కిషోర్ బాబు, కృష్ణ ప్రసాద్, నాగ రాజు జూడ, ప్రముఖ్, కిషోర్ మాదల, శివ బాబు, రంగా గల్లా, కోటేంద్ర, శ్రీనివాస్ పుట్టా, లక్ష్మి శ్రీనివాస్, భరత్ భాష్యం, రామ్ వంగవోలు, శ్రీకర్ తదితరులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected