Connect with us

Birthday Celebrations

Qatar NRI TDP గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Published

on

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతార్ (Qatar) తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు శ్రీ గొట్టిపాటి రమణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన సభ్యులందరు కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి గొట్టిపాటి రమణ (Gottipati Ramana) గారితో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతుల హాజరు అయ్యారు.

వీరితోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ్యులు, అభిమానులు ఈ సెలబ్రేషన్స్ లో ఆహ్లాదకరంగా పాల్గొన్నారు. నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర విజయవంతం కావాలని అని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా జై లోకేష్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అందరూ ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ (Qatar NRI TDP) నాయకులు శ్రీ గొట్టిపాటి రమణ మరియు తోటి నాయకులను అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected