జర్మనీ లోని హాంబర్గ్ (Hamburg) నగరం లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలు ది. 13.04.2025 న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్ఆర్ఐ టిడిపి (NRI TDP) జర్మనీ (Germany) విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు ఎన్ఆర్ఐ టిడిపి ప్రతినిధులు తెలిపారు.
హాంబర్గ్ (Hamburg) లో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శివశంకర్ లింగం (Dr. Sivashankar Lingam) అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), మాజీ MLC ఏఎస్ రామకృష్ణ (A.S. Ramakrishna) పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లి గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నేతలు కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ లకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) చేసిన సేవల్ని పలువురు వక్తలు కొనియాడారు. విభిన్న పాలనతో అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని పేర్కొన్నారు. “రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు.
రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. అలాంటి రాజనీతిజ్ఞత చంద్రబాబు సొంతం. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ను ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా (Chief Minister), అలానే సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత గా చరిత్ర లో నిలచిపోయారు. నవ్యాంధ్ర ను శిథిలం నుంచి శిఖరం వైపు నడిపిస్తున్నారు.
ఆయన 75 వ వసంతం లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని డైమండ్ జూబ్లీ (Diamond Jubilee) పేరుతో అంగరంగ వైభవంగా జర్మనీ (Germany) లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా, క్విజ్ పోటీలు, రక్తదాన శిబిరాలు, బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరగనున్నాయి. చివరి రోజు విజేతలకు బహుమతులు అందజేస్తాం” అని నిర్వాహకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, హాంబర్గ్ (Hamburg) టీడీపీ టీం శశిధర్ ఏమిరెడ్డి (Shashidhar Reddy Amireddy), విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, అఖిల్ ప్రసన్న దున్న, శ్రీకాంత్ గోళ్ళ, ఉజ్వల్ మారెడ్డి, ఫ్రాంక్ఫర్ట్ నుండి శ్రీకాంత్ కుడితిపూడి, మునిచ్ నుండి నరేష్ కోనేరు, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.