Connect with us

Birthday Celebrations

UK: పలు నగరాల్లో అభిమానాన్ని చాటిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Published

on

యునైటెడ్ కింగ్డమ్ లోని అనేక నగరాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అన్ని చోట్లా కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Hounslow, Birmingham, Eastham, Ilford, Coventry, Luton, Leicester, Preston నగరాల్లో ఆయా నగరాల తెలుగు యువత వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదిస్తూ, నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు.

ఎన్నారై టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి మరియు వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో అందరూ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టాల్సిందేనన్నారు.

ఈ వేడుకల్లో టీడీపీ యూకే (NRI TDP UK) నాయకులు జైకుమార్ గుంటుపల్లి, సురేష్ కోరం, ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని,పాలడుగు శ్రీనివాస్, శ్రీకిరణ్ పరుచూరి, వాసు ఐనంపూడి, అమర్నాథ్ మన్నె మరియు శ్రీనివాస్ లగడపాటి పాల్గొన్నారు.

అలాగే ఆయా సిటీ తెలుగు యువత (Telugu Yuvatha) సభ్యులు రవితేజ లింగ, శశాంక్ పెమ్మసాని, రవి నల్లమోతు, రాయుడి ఆదిత్య ,హరి, యుగంధర్ చింతలపూడి, గోపి భాష్యం, నరేంద్ర ములకలపల్లి, వినోద్ మాదాల తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected