Connect with us

Birthday Celebrations

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో బాలయ్య జన్మదిన వేడుకలు

Published

on

నందమూరి అందగాడు, హిందూపురం శాసనసభ్యుడు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యములో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కువైట్ సాల్మియా ఏరియాలో ఉన్న అవంతి ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. తెదేపా కువైట్ అధ్యక్షులు సుధాకర రావు మాట్లాడుతూ బాలకృష్ణ గారు మనసున్న మారాజు, ఆయన తల్లిగారి పేరుమీద వున్న కేన్సర్ హాస్పిటల్ ద్వారా కేన్సర్ బారిన పడిన ఎంతోమందికి ఉచిత వైద్య చేస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు అన్నారు.

ఆ భగవంతుడి ఆశీస్సులతో బాలకృష్ణ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఇంకా ఎంతో మందిని కాపాడాలని కోరారు. తెదేపా కువైట్ పి.ఆర్.వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ కువైట్లో అందరికి బాలయ్య బాబు మేనియా అని, బాలయ్య బాబు డైలాగులు వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, అంత పవర్ ఫుల్ డైలాగులు చెప్పే వ్యక్తి సినిమా ఇండస్టీలో లేరని అన్నారు.

ఈడుపుగంటి దుర్గాప్రసాద్, దుగ్గి శ్రీను, చాన్ బాషా, బోయపాటి శ్రీను, సుబ్బా రెడ్డి, కొల్లి ఆంజనేయులు, పెంచల్ రెడ్డి, తుంగ రాఘవ, కోనంగి మల్లికార్జున, చిన్న రాజు, బల్లాపురం మల్లయ్య, మచూరి శివ, సంతోష్, వేణు, వంశీ కృష్ణ కాపెర్ల తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected