Germany, Frankfurt: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జర్మనీ దేశంలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో NRI టీడీపీ జర్మనీ మరియు నందమూరి ఫ్యాన్స్ జర్మనీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు.
వారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారి సినీ, రాజకీయ, సామాజిక సేవల విభాగాల్లో చేసిన అపూర్వమైన సేవలను కొనియాడారు. ఆయన పని తత్వం, క్రమశిక్షణ, సమాజానికి చేసే సేవలు ప్రస్తుత తరం యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో NRI టీడీపీ జర్మనీ సభ్యులు శ్రీకాంత్ కుడితిపూడి, నరేష్ కోనేరు, సుమంత్ కొర్రపాటి, విక్రం తల్లపనేని, ఫర్హత్ మిర్జా, కళ్యాణ్ సుంకు, అలాగే నందమూరి ఫ్యాన్స్ జర్మనీ సభ్యులు రామ్ గోపాల్ బలిజెపల్లి, రాజశేఖర్ పర్ణపల్లి, అనుదీప్ మెదరిమెట్ల తదితరులు పాల్గొన్నారు.
వేదికపై నందమూరి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కేక్ కట్ చేయడంతో పాటు బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారి సినీ ప్రస్థానం, సేవా కార్యక్రమాలపై ఆసక్తికరమైన సందేశాలతో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.