Connect with us

Movies

ఘనంగా నందమూరి నటసింహం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ @ New England, Massachusetts

Published

on

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14 న అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ (New England, Massachusetts) లో శ్రీ బోళ్ల (Sri Bolla) మరియు తరణి పరుచూరి (Tarani Paruchuri) అధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ (Golden Jubilee Celebrations) కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి “రావి అంకినీడు ప్రసాద్, అశ్విని అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి, శ్రీకాంత్ జాస్తి, సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి, రావ్ కందుకూరి, శశాంక్ , దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని” సహకరించారు.

ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య (Balayya) అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ ఆ వీడియోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వేడుకకు అమెరికాలోని తెలుగువారు జై బాలయ్య (Jai Balayya) అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్ లు వ్యాఖ్యతగా వ్యవహరించగా, బాలయ్య అభిమానులల్లో మరింత జోష్ ను పెంచేందుకు సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్ లు బాలయ్య పాటలను పాడి, ఆడి నందమూరి అభిమానులను అలరించారు.

అనంతరం ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శ్రీ శైలజ చౌదరి అండ్ గ్రూప్ వారి నృత్య ప్రదర్శన నందమూరి అభిమానులను (Nandamuri Fans) ఆకట్టుకుంది. వారి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ నందమూరి నటసింహం బాలకృష్ణ (NBK) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected