మాతృత్వం మహిళా జీవితంలో మరపురాని మనోహర ఘట్టం
మాతృత్వం మనిషి మనుగడకు ప్రకృతి కట్టిన పట్టం
మగువకు వచ్చే మరో అపురూపమైన జన్మ మాతృత్వం
పసి బిడ్డను విలక్షణమైన పౌరునిగా తీర్చి దిద్దే అమూల్యమైన బాధ్యత మాతృత్వం
సృష్టికి మూలాధారం అమ్మ
తన అనే ప్రతిదీ ధారాపొసే త్యాగమూర్తి అమ్మ
సద్గుణ సామర్థ్యాలను, నైతిక విలువలను బోధించే ప్రధమ గురువు అమ్మ
ప్రపంచానికి రాజైనా ఒక అమ్మకు కొడుకే
అమ్మ చూపే వాత్సల్యం పసి బిడ్డకు వేడుకే
ప్రతి బిడ్డని తన బిడ్డలాగా ఆదరించే తల్లులు కీర్తనీయం
తన, పర అనే భేద భావాలతో పిల్లల రూపు రేఖలను అవహేళన చేసే తల్లులు విమర్శనీయం
ప్రాపంచిక వ్యామోహంతో, స్వలాభాల స్నేహాలతో, పాశ్చాత్య వ్యసనాలతో
అమ్మ అనే పదానికి విలువ తరిగిపోవడం శోచనీయం
జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!
మల్లికా రెడ్డి
(సంభవామి యుగే యుగే)