తెలుగు విద్యార్థి సంఘం AA ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne, Australia) నగరం మోనాష్ యూనివర్సిటీ (Monash University) లో వినాయక చవితి ని పురస్కరించుకొని గణపతి వేడుకను సెప్టెంబర్ 3న అంగరంగ వైభవం గా జరిపారు. ముందుగా వినాయకుడికి పూజ చేసి హారతి ఇచ్చిన తద్దనంతరం భారీగా పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా భక్తులను అలరించడం కోసం ఏర్పాటు చేసినా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆకట్టుకున్నాయి. ధోల్ బృందం చేసిన డప్పు వాయుధాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. కొందరూ యువతీ యువకులు పాల్గొని పలు పాటలు కు నృత్యం ఆడారు.
ఈ పండుగలో తెలుగు వారే కాకుండా పలు రాష్ట్రాల భారతీయలు విశేష సంఖ్యలో పాల్గొని పండుగ సంబుర వాతావరణాన్ని నెలకొలిపారు. ఈ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) తో పాటు పలువురు స్థానిక పార్లమెంట్ సభ్యులు పాల్గొని వినాయకుడిని దర్శించుకొని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్బంగా తెలుగు సాంస్కృతిక వైభవంతో పాటు ఇక్కడ ప్రజల ఐక్యతను చాటి చెప్పేలా ఇంత పెద్ద స్థాయిలో వేడుకను నిర్వహించిన AA (Australia Alludu) విద్యార్థి సంఘం సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చివరగా నిర్వహించిన లడ్డు ల వేలం పాట లో భక్తులు పోటీగా పాల్గొన్నారు.
మొత్తం మూడు లడ్డులకు వేలంపాట నిర్వహించగా లక్షల్లో లడ్డులను సొంతం చేసుకున్నారు. అందులో 5కేజీ ల లడ్డు ను $4650 (2,51,000 రూపాయలు), 11 కేజీల లడ్డును $7650 (4,13,000) మరియు 21 కేజీ ల లడ్డు ను $10600 (5,72,000) కు పలువురు స్థానిక తెలుగువారు దక్కించుకున్నారు.