Connect with us

Literary

ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయ అంశాలపై ఆధునిక దృక్పథం: NATS Webinar

Published

on

అంతర్జాలం, ఏప్రిల్ 16: తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై  వెబినార్ నిర్వహించింది. ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయమైన అంశాలను ప్రముఖ రచయిత, అధ్యాపకులు, తెలుగు అకాడమి సభ్యులైన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ వివరించారు.

మహాభారత కావ్యంలో నేటికి పనికి వచ్చే ఆధునిక అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆ అంశాలను విడమరిచి చెప్పారు. భాగవతంలో శ్రీ కృష్ణుడు పర్యావరణ పరిరక్షణ అనేది ఎలా చేశారు అనేది కప్పగంతు రామకృష్ణ తెలిపారు. ప్రాచీన సాహిత్యాన్ని మనం చూసే దృష్టి కోణం మార్చుకుంటే ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చని, వాటిని నేటి సమాజానికి అన్వయించుకోవచ్చని తెలిపారు.

సమాజంలో యువత పెడదోవ పెట్టకుండా ఉండాలంటే ప్రాచీన సాహిత్యాన్ని సరైన కోణంలో అధ్యయనం చేయాలని సూచించారు. మహాభారతం చదివితే అది వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుందని కప్పగంతు రామకృష్ణ అన్నారు.  తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగువారికి గుర్తు చేసేందుకు నాట్స్ తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుంటుందని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.

నాట్స్ లలితా కళా వేదిక ద్వారా తెలుగు భాష ప్రత్యేకత ఏమిటినేది నేటితరం, రేపటి తరం తెలుసుకునేలా నాట్స్ సదస్సులు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. ఈ సదస్సుకు వ్యాఖ్యాతలుగా నాట్స్ నాయకులు శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యవహరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected