Connect with us

News

మానవత్వం చాటిన పాలకొల్లు ఎమ్మెల్యే

Published

on

రాజకీయనాయకుల్లో వాగ్దానాలు ఇచ్చేవాళ్లను చూసివుంటాం. అలాగే ఎవరికన్నా ఆపద వస్తే డబ్బులో మనుషులనో పురమాయించి సహాయం చేసేవాళ్లను చూసివుంటాం. కానీ సహాయం చేసేటందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే తనే రంగంలోకి దిగి దగ్గిరుండి పని పూర్తి అయ్యేవరకు సహాయం చెయ్యడం మాత్రం ఒక్క పాలకొల్లు ఎమ్మెల్యే కే చెల్లింది.

పాలకొల్లు లో ఒకరు చనిపోవడం, కైలాస రథాన్ని నడిపే డ్రైవర్ కి కరోనా రావడంతో ఇంకెవ‌రూ వాహ‌నాన్ని న‌డిపేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలోనే తను ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక సామాన్యునిలా తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు స్వ‌యంగా కైలాస‌ర‌థం డ్రైవ‌ర్‌గా మారి మృత‌దేహాన్ని శ్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించి అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌క‌రించారు. దీంతో అందరూ పాలకొల్లు ఎమ్మెల్యే అంటే పాలకొల్లు ఎమ్మెల్యే నే అని అభినందిస్తున్నారు.