అమెరికా లోని ఒరెగాన్ (Oregon) రాష్ట్రంలో పోర్ట్లాండ్ (Portland) టీడీపీ మహానాడు మే 31 శనివారం నాడు చాలా అట్టహాసంగా ఆర్భాటంగా జరిగింది. ఈసారి మహిళలు, యువత తమ అభిమాన పార్టీ కోసం ముందు ఉండి నడిపించారు.
పెద్ద NTR (Nandamuri Taraka Ramarao) పుట్టినరోజు, టీడీపీ (Telugu Desam Party – TDP) గత సంవత్సర కాలం పాలన మరియు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కి పద్మ భూషణ్ (Padma Bhushan) వచ్చిన సందర్భం గా సంబరాలు చేసుకున్నారు.
దీన్లో భాగం గా మా తెలుగు తల్లికి పాటకి మహిళలు, చిన్నారులు బాలయ్య బాబు పాటలకి స్టెప్పులు వేసి అలరించారు. టీడీపీ (TDP) పాలనలో భాగంగా చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత మరియు IT సంబంధిత కార్యక్రమాల గురించి ప్రసంగించారు.
మంచి విందు భోజనం, బాలయ్య బాబు, టీడీపీ, మహానాడు మీద క్విజ్ ఇంకా మరెన్నో ఆహ్లాదభరితమైన కార్యక్రమాలు జరిగాయి. ఎన్నారైలు నరహరి రామినేని (Narahari Ramineni) మరియు మారుతి యరపతినేని (Maruthi Yarapathineni) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాల గురించి ప్రసంగించారు.