Connect with us

Music

నవ్వుల నవాబు మిమిక్రీ రమేష్ కి స్వరబ్రహ్మ బిరుదాంకితం @ Swara Raaga Sudha Musical Event

Published

on

అమెరికాలోని అట్లాంటా (Atlanta) నగరంలో జూన్ 30, ఆదివారం రోజున స్వర రాగ సుధా ఆధ్వర్యంలో మ్యూజికల్ కాన్సర్ట్ (Musical Concert) నిర్వహించారు. ప్రముఖ గాయకులు శ్రీనివాస్ దుర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ రమేష్ పాల్గొన్నారు.

ఈ Musical Event లో స్వర రాగ సుధ (Swara Raaga Sudha) సంగీత, సాహిత్య సేవా సంస్థ మిమిక్రీ రమేష్ కి స్వరబ్రహ్మ అనే బిరుదును ప్రధానం చేసింది. అలాగే గాయకులు శ్రీనివాస్ దుర్గం (Srinivas Durgam), పారిజాత (Parijatha Bardipur), ఆదిత్య సరళ రెడ్డి తదితరులు పలు తెలుగు మరియు హిందీ పాటలు పాడి శ్రోతలను ఆనందింపజేశారు.

నాలుగు గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆసాంతం సంగీత సాగరంలో ఓలలాడించడంతోపాటు, మిమిక్రీ రమేష్ అత్యద్భుతంగా మిమిక్రీ చేసి నవ్వులు కురిపించారు. ఈ సందర్భంగా అందరూ గాయనీ గాయకులను మరియు మిమిక్రీ రమేష్ (Mimicry Ramesh) ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected