Milwaukee, Wisconsin– ఆంధ్రప్రదేశ్ (Vijayawada) మరియు తెలంగాణ (Khammam) వరద బాధితుల సహాయార్థం మిల్వాకీ కమ్యూనిటీ Hindu Temple of Wisconsin సహకారంతో $11,000 (Rs 9,00,000) నిధులు సమీకరించింది. ఈ నిధులు హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకి $5,397 (4,50,000 INR) లెక్కన రెండు రాష్ట్రాలకీ పంపించబడ్డాయి.
ఈ సహాయక కార్యక్రమం హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్ (Hindu Temple of Wisconsin), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ మిల్వాకీ (Telugu Association Of Greater Milwaukee – TAGM), మరియు మిల్వాకీ తెలంగాణ అసోసియేషన్ (Milwaukee Telangana Association – MiTA) సహకారంతో విజయవంతంగా జరిగింది. మిల్వాకీ కమ్యూనిటీ యొక్క ఈ సహాయం వరద బాధితులకు ఒక భరొసా మరియు సహాయం అందించడంలో ముఖ్య పాత్ర పోషించింది.