Edison, New Jersey, October 27, 2024: అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం (NATS New Jersey Chapter) తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్‌డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు.
ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన (Awareness) కల్పించారు.
డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతు
ఆసియన్ అమెరికన్ (Asian Americans) డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం (Chamberlain University) మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ (Rutgers University) కి చెందిన పీహెచ్‌డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు.
ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా (Dementia) బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ (North America Telugu Society – NATS) కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది.
నాట్స్ (NATS) బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి (Bindu Yalamanchili) తోపాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు.
తెలుగు లలిత కళా సమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ (NATS) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేకంగా అభినందించారు.