Connect with us

Health

తానా ఫౌండేషన్ & స్వేచ్ఛ Mega Medical Camp, ఉచితంగా మందుల పంపిణీ

Published

on

పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించడానికి తానా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. గచ్చిబౌలి లోని స్వేచ్ఛ కార్యాలయంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు శశికాంత్ హాజరయ్యారు.

ఈ క్యాంప్ కు తానా ఫౌండేషన్ తరపున సహకారం అందించారు. 20 నెలలుగా ప్రతి మొదటి ఆదివారం నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి తానా ఫౌండేషన్ సహకారం అందించడం ఇది మూడోసారి. ఈరోజు నిర్వహించిన శిబిరానికి కాట్రగడ్డ సునీత జ్ణాపకార్ధం కాట్రగడ్డ ప్రశాంత్ మరియు శాన్వీ దాతలుగా వ్యవహరించారు.

ఈ క్యాంప్ కు హైదరాబాద్ (Hyderabad) సమీపంలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్ నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు. వీరికి 13 మంది వైద్యులు (Doctors) సేవలు అందించారు. హాజరైన పేషెంట్లు అందరికీ ఫ్రూట్స్ మరియు పులిహోర అందచేశారు.

స్వేచ్ఛ (Swecha) తరపున సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బీటెక్ విద్యార్థులు, బ్యాంక్ ఉద్యోగులు ఇతర మేధావులు వలంటీర్లుగా సేవలు అందించారు. తానా ఫౌండేషన్ (TANA Foundation) ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) పేషెంట్లను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

మరింత మెరుగైన సేవలు అందించడానికి కూడా తాము సిద్ధమని క్యాంప్ నిర్వాహకులకు శశికాంత్ తెలియచేశారు. ఈ మెడికల్ క్యాంప్ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారు. ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు.

పేషెంట్లు అందరికీ ఒక నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. స్వేచ్ఛ వ్యవస్థాపకులు, ప్రస్తుత ఉపాధ్యక్షులు కిరణ్ చంద్ర స్వేచ్ఛ కార్యవర్గం తరపున తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి మరియు తానా (TANA) నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected