Connect with us

Movies

అట్లాంటా మెగాఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆచార్య ప్రీమియర్ షో హంగామా

Published

on

మెగాస్టార్ చిరంజీవి ప్రతీ సినిమాకి వైవిద్యభరితంగా ప్రీమియం షో తీర్చిదిద్దడంలో అట్లాంటా మెగాఫ్యాన్స్ అమెరికాలోనే ఒక నూతన ఒరవడి సృష్టించడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. అది ఖైది నెంబర్ 150 ఒక్క ప్రీమియర్ రోజున 1500 టికెట్స్ కావచ్చు, అర్ధరాత్రి 2 గంటల షో కావచ్చు.

అమెరిక చరిత్రలోనే ఒక ఇండియన్ హిరోకి 16 అడుగుల నిలువెత్తు కటవుట్ పెట్టడం సైరా సినిమాకి చిరంజీవికి మాత్రమే చెల్లింది. 10 అడుగుల చిరంజీవి మరియు రాం చరణ్ నిలువెత్తు కటవుట్స్ ఆకర్షణగా నిలిచాయి. ఇక సినిమా ఆసాంతం మెగాఫ్యాన్స్ డాన్సులు, ఈలలు, అరుపులతో థియేటర్ మార్మోగిపోయింది.

ఆచార్య ప్రీమియం షో విశేషాలు:-

  • డిజిమేక్స్ ధియేటర్ బయిట 10 అడుగుల బేనర్ పెట్టడం ఇదే మొదటిసారి.
  • దియేటర్లో అడుగడుగునా అట్లాంటా మెగాఫ్యాన్స్ బ్యానర్స్ తో నింపివేయడం.
  • కార్ ర్యాలి – ఆచార్య పోస్టర్స్ తో కార్ ర్యాలి జరగడం అట్లాంట చరిత్రలో ఇదే మొదటిసారి.

  • అట్లాంటా మెగాఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆచార్య టీ షర్ట్స్ పంపిణీ చెయ్యడం.
  • మొట్టమొదట సారిగా కొణిదెల ప్రొడక్షన్స్ లోగొని (కాషాయం బేక్డ్రాప్ లో హనుమాన్ ముఖచిత్రం) కిచైన్స్ 200 వరకు మెగాభిమానులకు అందచేయడం.
  • ఆచార్య సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పుతూ మెగాఫ్యాన్స్ సమక్షంలో కేక్ కటింగ్.
  • గడిచిన పదిరోజులుగా క్విజ్ లో పాల్గొని విజేతలు గా నిలిచిన 25 మెగాబిమానులకు గిఫ్ట్ కార్డ్స్ అందించడం జరిగింది.
  • కంఫెటీస్, పేపర్ కటింగ్స్ తో డిజిమేక్స్ ధియేటర్ నిండి పోయింది.
  • దక్కన్ స్పైస్ వారు స్నేక్స్ స్పాన్సర్ చెయ్యడం.
  • అమెరికా చరిత్రలోనే పాటని మళ్ళీ వేయడం ఇదే మొదటిసారి. ఇక బంజార పాటకు మెగాభిమానులు కేరింతలు కొట్టారు.

ఈ మెగా మహత్కర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన స్పాన్సర్స్ వివరాలు:-

  • 10 అడుగుల బేనర్ / 6 అడుగుల స్టేండింగ్ బేనర్ / 6 అడుగుల బేనర్ / విజిల్స్  – రాఘవ బోగాది
  • 10 అడుగుల చిరంజీవి కటవుట్ – మహా రాణా
  • 10 అడుగుల రాంచరణ్ కటవుట్ – రాం కేసాని
  • 200 కీ చైన్స్ – వెంకట రాజు మండపాటి
  • ఆచార్య టీ షర్ట్స్ – సురేష్ కరోతు, శ్రవణ్, వెంకట గోక్యాడ, కృష్ణ మేకల, రవి యెలిశెట్టి, రాఘవ బోగాది, సురేష్ బండారు, చిన్మయ మంచాల
  • క్విజ్ స్పాన్సర్స్ – వన బాస్కర్, రవి పుప్పల, విజయ్ సామాన్యు
  • డిజిటల్ ఇమేజస్ – వినయ్ మద్దినేని (రాగలహరి వెబ్సైట్)

  • స్నాక్స్ – డక్కన్ స్పైస్
  • కేక్ – శ్రీరాం
  • కంఫిటీస్ – కళ్యాణ్
  • ఫొటోగ్రఫి & విడియోగ్రఫి – వినయ్ & రవి
  • డ్రోన్ ఫొటోగ్రఫి – సిద్ లియో

మరిన్ని ఫోటోల కొరకు రవి వడ్డమాను వెబ్సైట్ ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected