Connect with us

Health

అమీనాపురంలో విజయవంతంగా తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు

Published

on

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, అమీనాపురం గ్రామం నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయక్తముగా మే 22వ తేదీన మెగా ఐ క్యాంపు నిర్వహించారు. సుమారు మూడు వందల మందికి పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు అందించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అమీనాపురం గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి అనిత యెర్నేని స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected