Connect with us

News

Telangana లో కక్ష పూరిత రాజకీయాలు ప్రారంభించారు: Palla Rajeshwar Reddy, Jangaon BRS MLA @ Virginia

Published

on

కక్ష పూరిత రాజకీయాలు తెలంగాణ (Telangana) లో ప్రారంభించారని జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వాతావరణo తెలంగాణలో లేదు అన్నారు. BRS పార్టీ వీడే ప్రసక్తే లేదు అన్నారు జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) కి కూడా తెలుసు అన్నారు.

ఉద్యమం నుంచి రాజకీయాలలోకి వచ్చాను. ఉద్యమంలో అరెస్ట్ అయ్యాను. నేను పార్టీ మారను అని ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా (Virginia) లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించాలి. గెలిచిన పార్టీలో ఐదేళ్లు ఉండాలి అన్నారు. పార్టీ మారాలి అని నాపై ప్రభుత్వం (Government) ఒత్తిడి చేస్తున్నారు.

ఆరు నెలల్లో నాలుగైదు కేసులు నమోదయ్యాయి. విచారణ పేరుతో కమిటీలు వేశారు. నాతోపాటు బార్య నీలిమ, కొడుకు అనురాగ్ పై కూడా కేసులు పెట్టారు. వాటికి భయపడను. ఎదుర్కొంటూ పోరాడత. BRS (Bharat Rashtra Samithi) లోకి రాక ముందు జేఏసీ తో కలిసి తెలంగాణ (Telangana) కోసం పనిచేశా, అప్పుడు కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు పెడుతున్నారు. నాకు కేసులు కొత్త కాదు అన్నారు పల్లా.

కాళేశ్వరం (Kaleshwaram Project) అద్భుత ప్రాజెక్ట్. నిపుణుల సలహాతో అక్కడ కట్టారు. అవగాహన లేమితో కొందరు మాట్లాడుతున్నారు. అనేక రిజర్వాయర్ లలో కాళేశ్వరం ఒకటి. అనేక మంది కాంట్రాక్ట ర్లు ప్రాజెక్టులో నిమగ్నం అయ్యారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ (Indian National Congress Party) వచ్చింది.. ఈ విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అన్నారు.

KCR (Kalvakuntla Chandrashekar Rao) కి శ్వాస, ధ్యాస తెలంగాణే అన్నారు పల్లా (Palla Rajeshwar Reddy). తెలంగాణ తలెత్తుకొని నిలబడేలా కెసిఆర్ (KCR) చేశారు అన్నారు. ఇక్కడి యూనివర్సిటీల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందన్నారు. మౌలిక సదుపాయాలు, పరిశోదన లాంటి అంశాల్లో ఆదర్శం అన్నారు. మన స్టూడెంట్స్ స్ట్రాంగ్.. అందుకే 30 శాతం మంది ఇండియా వాళ్ళే ఉంటారు. అందులోనూ తెలుగు వాళ్ళే ఉంటారు.

ఇటు విద్య, అటు ఉద్యోగం విషయాల్లో మన వాళ్ళ పైనే విదేశీ యూనివర్సిటీలు ఆధార పడుతున్నాయి. ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. ఆటా (American Telugu Association) ప్రెసిడెంట్ ఎలక్ట జయంత్ చల్లా, ఆటా (ATA) గత ప్రెసిడెంట్ లు భువనే శ్ భుజాల, రామ్మోహన్ రెడ్డి కొండ, TDF USA (Telangana Development Forum USA) పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి పల్లా, జీనత్, పవన్ గుమ్ముదల, రాజేష్ మాదిరెడ్డి, వేణు నక్షత్రం, GTA (Global Telangana Association) చైర్మన్ విశ్వేశ్వర రెడ్డి కలవల మరియు వివిధ స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected