Connect with us

Events

చికాగోలో మండలి బుద్ధ ప్రసాద్ తో ఆత్మీయ సమావేశం విజయవంతం: Hema Kanuru, Jayaram Komati, TDP

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి చికాగో పర్యటన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ శ్రీ కోమటి జయరాం గారి పర్యవేక్షణలో, స్తానిక టీడీపీ నాయకులు శ్రీ హేమ కానూరు గారి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించగా టీడీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి శ్రీ యుగంధర్ యడ్లపాటి గారు అధ్యక్షత వహించగా, మురళి మేరుగ గారు శాలువాతో బుద్ధ ప్రసాద్ గారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గారు అభిమానులను ఉద్దేశిస్తూ వర్తమాన రాజకీయాలతో పాటుగా తెలుగు జాతి వైభవాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రముఖులు మరియు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాంలో తెలుగు జాతికి లభించిన గుర్తింపు నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వరకు ప్రస్తావించడం జరిగింది.

అలాగే ప్రవాసాంధ్రులకి పిలుపునిస్తూ తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ అర్ ఐ టీడీపీ చికాగో ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్ చనుమోలు, రఘు చిలుకూరి, కిషోర్ త్రిపురనేని, పవన్ నల్లమల్ల తదితరులు సమన్వయపరిచి విజయవంతం అవ్వడంలో తోడ్పడ్డారు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected