Connect with us

News

తెలంగాణ IT మంత్రి శ్రీధర్ బాబు తో GTA ఆత్మీయ సమావేశం @ Washington DC

Published

on

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ (Washington DC) వారు ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ప్రవాస భారతీయులు (NRIs) పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా గ్రామ పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు. కేరళలో ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తుందని అంతకన్నా మిన్నగా అతి త్వరలో తెలంగాణ (Telangana) ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనుందని తెలియజేశారు.

పెద్దపల్లి జిల్లాలో త్వరలో 1000 కోట్లతో కోకకోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (Coca-Cola Manufacturing Unit) ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గత ప్రభుత్వ (Government) హయాంలో మూతపడిన నిజాం సుగర్ ఫ్యాక్టరీని ఏడాదిలోగా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

చెరుకు రైతులకు మేలు చేయడంతో పాటు ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. హైదరాబాద్ (Hyderabad) లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర (Telangana State) నలుమూలల ఫైబర్ నెట్వర్క్ (Fiber Network) అందుబాటులో ఉందని, ప్రవాస భారతీయులు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు రావాలన్నారు.

హైదరాబాద్ (Hyderabad) నగరానికి పరిమితం కాకుండా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy Anumula) కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాదును ఏఐ (Artificial Intelligence) క్యాపిటల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) చైర్మన్ విశ్వేశ్వర్ కలువల (Vishweshwar Reddy Kalavala)తో పాటు 6TV చైర్మన్ సురేష రెడ్డి, GTA ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, వాషింగ్టన్ డీసీ (Washington DC) ఉపాధ్యక్షులు కోట్య బానోత్, రాము ముండ్రాతి, ఎక్స్కూటివ్ కమిటి టీం సునీల్ కుడికాల, మధు యనగంటి మరియు ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected